తరచూ కడుపు నొప్పి వస్తుందా.. అయితే ఈ సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు పాటించండి!

First Published | Nov 4, 2021, 3:40 PM IST

ఎక్కువగా తిన్నప్పుడు తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వల్ల కడుపు నొప్పి రావడంతో తరచూ మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ఇలాంటి కడుపునొప్పి (Stomach ache) సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ ఆర్టికల్ (Article) ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం

stomach pain

అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల అజీర్ణం కలుగుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం కాదు. దాంతో కడుపు నొప్పి (Stomach ache), గ్యాస్ (Gas) వస్తుంది. ఒక్కోసారి ఈ కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కడుపులో తిప్పడం, నొప్పి మనల్ని చాలా చికాకును కలిగిస్తాయి.

stomach pain

ఈ నొప్పుల (Pain) నుంచి విముక్తి కలగడానికి పెయిన్ కిల్లర్స్ (Pain killers) ను వాడుతాం. ఇలా తరచూ మందులు వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ సమస్యలను సహజమైన ఇంటి పద్ధతులలో తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.   


stomach pain

ఒక స్పూన్ నిమ్మకాయరసం (Lemon juice), ఒక స్పూన్ పుదీనా రసం (Mint juice), ఒక స్పూన్ అల్లం రసం (Ginger juice) ఇలా మూడింటిని సమపాళ్లలో తీసుకుని అందులో కొంచెం ఉప్పు (Salt) కలిపి తీసుకుంటే కడుపు నొప్పి నుంచి తక్షణమే విముక్తి కలుగుతుంది.

stomach pain

ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఇందులో ఒక స్పూన్ తేనె (Honey) కలిపి ఈ నీటిని తాగాలి. ఇలా తాగడంతో కడుపునొప్పి, అజీర్తి సమస్యలను తగ్గించవచ్చు.

వాములో నొప్పి తగ్గించే ఔషధగుణాలు ఉంటాయి. ఒక స్పూన్ వాము (Bishopsweed), ఒక స్పూను చక్కెర  (Sugar) రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని నమలాలి. రెండు నిమిషాలలోనే మీ ఉబ్బరం తగ్గి కడుపు నొప్పి తగ్గటం మొదలవుతుంది.

నిమ్మకాయలో (Lemon) జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. నిమ్మకాయ ఆరోగ్యానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తాగాలి. కొద్దిసేపటిలోనే కడుపు నొప్పి (Stomach ache) నుండి ఉపశమనం పొందుతారు. 
 

బేకింగ్ సోడాలో (Baking soda) కడుపు నొప్పిని తగ్గించే పోషకాలు ఉంటాయి. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని (Hot water) నీటిలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల కడుపు భాగంలో ఏర్పడిన నొప్పి నుండి తక్షణమే విముక్తి కలుగుతుంది.  
 

కడుపులో గ్యాస్ మంట సమస్యలు మిమ్మల్ని బాధకు గురి చేస్తాయి. గ్యాస్ సమస్యలకు జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ జీలకర్రను (Cumin seed) తీసుకుని ఇందులో ఒక స్పూన్ చక్కెర (Sugar) కలుపుకుని నమిలి తినాలి. దీంతో కడుపు నొప్పి సమస్యలను తక్షణమే తగ్గిస్తుంది.
 

మసాలా ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది. ఉదయం, సాయంత్ర సమయాలలో తేలికపాటి వాకింగ్ (Waking) చేయడం తప్పనిసరి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి (Health) మంచిది.

Latest Videos

click me!