అందమైన కళ్ళ కోసం న్యాచురల్ టిప్స్.. ఇవి తెలుసుకుంటే మీ కళ్లు మెరిసిపోతాయ్?

First Published Oct 22, 2021, 9:23 PM IST

అందమైన కళ్ళ (Beautiful) eyes కోసం మనం ప్రత్యేకంగా ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకొనుట వలన వాటి అందాన్ని పెంచుకోవచ్చు. 

అందమైన కళ్ళ (Beautiful) eyes కోసం మనం ప్రత్యేకంగా ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకొనుట వలన వాటి అందాన్ని పెంచుకోవచ్చు. కలుషిత వాతావరణం, ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల  మన శరీరం ఒత్తిడికి (Stress) లోనయి దాని ప్రభావాన్ని కంటిమీద చూపుతుంది.
 

అందమైన కళ్ళ ఆరోగ్యం కోసం విటమిన్లు (Vitamins) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను, కాయగూరలను, ఆకుకూరలను తీసుకోవాలి. శరీరానికి తగినంత నిద్ర (Get enough sleep) అవసరం. మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి.
 

కంటి అందం కోసం ఆర్టిఫిషియల్ (Artificial) గా దొరికే క్రీములను వాడరాదు. ఇవి కంటిచూపును దెబ్బతీసే అవకాశం ఉంది. వీటిని  వాడడం వల్ల  సహజసిద్ధమైన (Instinctive) చర్మకాంతిని కోల్పోతాము. అందమైన కళ్ళ కోసం కొన్ని చిట్కాలను ఇంట్లోనే  పాటిస్తే సరిపోతుంది.
 

కంటిని ఎక్కువ సార్లు నీటితో (Water) శుభ్రపరుచుకోవాలి. సరైన నిద్ర అవసరం. రోజుకు ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం. కీర ముక్కలను కనురెప్పలపై ఉంచితే కంటికి తగిన విశ్రాంతి (Rest) దొరుకుతుంది.
 

విటమిన్ ఏ అధికంగా ఉన్న క్యారెట్, బీట్ రూట్, టమోటో, కీర జ్యూసులను తాగాలి. విటమిన్ సి ఉన్న కమలా జ్యూస్ లను తీసుకోవాలి. నువ్వుల నూనె (Sesame oil) , ఆముదం (Castor oil), కొబ్బరి నూనె గానీ రాస్తే ముడతలు పోయి చర్మం మృదువుగా మారుతుంది. మచ్చలు కూడా తగ్గిపోతాయి.
 

నువ్వుల నూనెతో రాత్రివేళల్లో కంటికింద మసాజ్ (Massage) చేసుకుంటే కంటికి విశ్రాంతి కలుగుతుంది. కంటి నరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. నల్లమచ్చలను (Blackheads) తగ్గిస్తాయి. కొంచెం పసుపు లో ఆలివ్ ఆయిల్ వేసుకొని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయి.
 

పడుకునే ముందు నీటితో మొహాన్ని కడుక్కోవాలి. రోజ్ వాటర్ (Rosewater) తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలి, ద్రవ పదార్థాలను సేవించాలి. రోజులో కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. శరీర ఒత్తిడిని తగ్గించుకోండి తగిన విశ్రాంతిని తీసుకోండి దీని ద్వారా మీ కళ్ళు ఆరోగ్యంగా (Healthy) ఉంటాయి.

click me!