మోకాలు నొప్పులతో బాధపడుతున్నారా అయితే ఈ సలహాలు మీకోసమే!

First Published Nov 21, 2021, 5:20 PM IST

మోకాళ్ల నొప్పులకు (Knee pain) ముఖ్యకారణం అధిక బరువుతో పాటు జీవనశైలిలోని (Lifestyle) మార్పులు కావచ్చు. మోకాళ్ళ నొప్పులు వృద్ధాప్య సమయంలోనే కాక యుక్తవయసు వారిని కూడా బాధిస్తున్నాయి. స్థూలకాయంతో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే అనేక కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.

మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో సరైన పోషక విలువలు ఉండడంతో పాటు సరైన వ్యాయామం అవసరం. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా మోకాళ్ల నొప్పులను ఏ విధంగా తగ్గించుకోవాలో దానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

ఎంత పని ఒత్తిడి ఉన్నా శరీరానికి తగిన విశ్రాంతిని కలిగించాలి. మన జీవన శైలిలో సరైన మార్పులను అలవరుచుకోవాలి. ఎముకలలో క్యాల్షియం (Calcium), పాస్పరస్ (Phosphorus) తగ్గినప్పుడు కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి అధిక మోతాదులో మందులను వాడడం మంచిది కాదు.

అధిక మోతాదులో టాబ్లెట్లను వాడటంతో కిడ్నీ సమస్యలు ఏర్పడుతాయి. విటమిన్ డి కారణంచేత కూడా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నొప్పులను తగ్గించుకోటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. మన జీవన విధానంలో కొన్ని మార్పులను అలవరచుకుంటే మోకాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

knee pain

క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, చేపలు, రాగులు, ఆకుకూరలు, వాల్ నట్స్, డ్రైఫ్రూట్స్, అంజీర, ఖర్జూరం, కిస్మిస్ లలో  క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని మన రోజువారీ ఆహార పదార్థాలలో చేర్చుకోవాలి. అప్పుడే ఎముకలకు కావలసిన క్యాల్షియమ్ అంది ఎముకలు దృఢంగా ఉంటాయి. రోజూ అరగంట పాటు ఎండలో ఉండటం వల్ల సూర్యకిరణాలు (Sunbeams) మన మీద పడి శరీరానికి కావలసిన విటమిన్-డి (Vitamin-D) లభిస్తుంది.

విటమిన్-డి మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్పును (Salt) తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడంతో మోకాళ్ల నొప్పి మరింతగా బాధిస్తుంది. రుచి కోసం మాత్రమే ఉప్పును వాడాలి. అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.   అధికంగా ఉప్పును వాడితే మోకాళ్లలో, కీళ్ల వద్ద జిగురు ఉత్పత్తి అవ్వకుండా అడ్డుకుంటుంది. ఎముకల జిగురు ఉత్పత్తి తగ్గడంతో మోకాళ్ల సమస్యకు దారితీస్తుంది. కీళ్ల దగ్గర జిగురు పదార్థం నిల్వ ఉండేందుకు శారీరక శ్రమ అవసరం. దానికోసం ప్రతిరోజూ వ్యాయామం (Exercise) క్రమం తప్పకుండా చేయాలి.

మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కాపురం పెట్టడం, జండుబామ్ రాయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. మోకాళ్ల నొప్పులను శాశ్వతంగా తగ్గించుకోవడానికి మన జీవన విధానంలోని ఆహారపు అలవాట్లు, వ్యాయామం తప్పనిసరి. మోకాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్  (Pain killer) టాబ్లెట్ లు ఎక్కువగా వాడరాదు. దీంతో కిడ్నీ సమస్యలు (Kidney problems) వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోకాళ్ల నొప్పులను సహజసిద్ధమైన పద్ధతిలో తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

click me!