ఎంతో రుచికరమైన అరటికాయ వడల తయారీ ఎలానో మీకు తెలుసా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 21, 2021, 07:05 PM IST

అరటికాయలలో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. అరటిపండును (Bananas) నిత్యం తీసుకోవడంతో జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. అయితే మనం ఇంటిలో అరటిపండ్లు ఉన్నాయంటే వేపుడు చేసుకోవడం, ఫ్రూట్స్ సలాడ్స్ (Fruit salad) చేసుకోవడం తప్ప మరొక రకంగా వండాలనే ఆలోచనే పెద్దగా రాదు కదా. కానీ వీటితో అరటి వడలు  చేసుకోవచ్చు అని మీకు తెలుసా. అరటి వడలు ఎంతో రుచిగా ఉంటాయి.

PREV
15
ఎంతో రుచికరమైన అరటికాయ వడల తయారీ ఎలానో మీకు తెలుసా?

తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు అరటికాయ వడలు. ఇది ఒక హెల్తీ స్నాక్స్ (Healthy snack) ఐటమ్ అని చెప్పవచ్చు. అరటికాయలు తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా వడల రూపంలో చేసి పెట్టండి. వారు వీటిని తినడానికి ఇష్టపడతారు. దాంతో వారికి తగిన పోషకాలు అందుతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అరటికాయతో వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

25

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉడికించిన అరటికాయ ముక్కలు (Boiled banana slices), సగం కప్పు సెనగపప్పు (Senagapappu), ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు (Ginger garlic paste), తగినంత ఉప్పు (Salt), తరిగిన కొత్తిమీర (Chopped Coriyander), తరిగిన కరివేపాకు (Curries), ఢీ ఫ్రై కి సరిపడు ఆయిల్ (Oil).
 

35

తయారీ విధానం: ఒక గిన్నెలో నీళ్ళు (Water) పోసి స్టవ్ మీద పెట్టి అందులో అరటికాయలను వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అరటికాయలను (Banana) తొక్కతీసి ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న సెనగపప్పును నీటిని వంపేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సెనగపప్పును ఒక గిన్నెలో చేసుకోవాలి.
 

45

ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరుగుకొని వీటిని సెనగపిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడు ఉప్పు (Salt), ఉడికించిన అరటికాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. వడల ఢీ ఫ్రై కోసం స్టవ్ పై బాండ్లి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో (Oil) వేయాలి.
 

55

వడలు మంచి కలర్ (Colour) వచ్చేవరకు రెండువైపులా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న వడలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని వడల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వడలను ఒక ప్లేట్ లో తీసుకుని చట్నీ, టమోటో కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన వేడివేడి అరటికాయ వడలు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఎంతో సులభంగా తయారు చేసుకునే అరటికాయ వడలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక మంచి హెల్తీ స్నాక్.

click me!

Recommended Stories