బొప్పాయి జ్యూస్
బొప్పాయి జ్యూస్ డయాబెటిస్ ఉన్న వారికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీన్ని మధుమేహులు తాగాలని సలహానిస్తుంటారు. నిజానికి ఇది ఉదయాన్నే తాగే పానీయం. ఎందుకంటే దీన్ని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు ఖాళీ కడుపుతోనే దీన్ని తాగాలి. ఇది షుగర్ ను బాగా తగ్గించడానికి సహాయపడుతుంది. కొవ్వు, పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉండే బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదెంతో మేలు చేస్తుంది.