ఈ పండ్లు బీపీ ని తగ్గిస్తయ్..

Published : May 15, 2023, 01:58 PM IST

రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, ఉప్పు వంటివి రక్తపోటును పెంచుతాయి. అయితే కొన్ని రకాల పండ్లు హై బీపీని తగ్గించడానికి సహాయపడతాయి. 

PREV
18
ఈ పండ్లు బీపీ ని తగ్గిస్తయ్..
Image: Getty

అధిక రక్తపోటు స్ట్రోక్, గుండెపోటు,  ధమనులలో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. అంతేకాదు మూత్రపిండాల వైఫల్యం, కళ్ల రక్తనాళాలు దెబ్బతినే  ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటివి రక్తపోటును బాగా పెంచుతాయి. రక్తపోటు ప్రమాదకరంగా ఉన్నప్పుడు మందులను ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే కొన్ని పండ్లు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

28

అరటిపండ్లు

అరటిపండ్లు కాలాలతో సంబంధం లేకుండా లభిస్తాయి. ఈ పండ్లు చాలా చవక కూడా. నిజానికి అరటిపండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అరటిపండ్లు పొటాషియానికి మంచి వనరు. దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది. అందుకే వీటిని తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది.

38
Strawberries

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్న స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.
 

48

పుచ్చకాయ

పుచ్చకాయ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండే పుచ్చకాయ డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది.

58
Image: Getty

మామిడి పండ్లు

ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు పండుతాయి. అందుకే ఈ సీజన్ లో మామిడి పండ్లను ఎక్కువగా తింటుంటారు. పొటాషియం సమృద్ధిగా ఉండే ఈ పండ్లు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.

68

దానిమ్మ

దానిమ్మ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి రక్తాన్ని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ పండ్లు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.

 

78

2.సి విటమిన్ పండ్లు..
సి విటమిన్ పండ్లు.. తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ..ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. అంటే.. అల్పాహారంగా తీసుకోకూడదు. తీసుకుంటే.. యాసిడ్ తయారై.. గుండెలో మంట వస్తుంది.

సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తాయి కూడా. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
 

88
kiwi

కివి

కివిలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఈ పండ్లను తింటే అధిక రక్తపోటు కూడా తగ్గిపోతుంది.
 

click me!

Recommended Stories