మెరిసే అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం కావాలా అయితే ఈ నూనెలను వాడండి..!

First Published Dec 22, 2021, 4:08 PM IST

మెరిసే అందమైన చర్మ సౌందర్యం కోసం అనేక ఫేషియల్స్, మసాజ్ లు ట్రై చేసి ఉంటాం. వీటితోపాటు చర్మానికి మంచి నూనెలను (Oils) అందించడంతో చర్మ సౌందర్యం (Skin beauty) పెరుగుతుందని మీకు తెలుసా? నూనెలు జుట్టు సంరక్షణను మెరుగుపరచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. ఈ నూనెలు చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మాన్ని తాజాగా ఉంచి ముడతలు పడకుండా చూడటంతోపాటు చర్మానికి సాగేగుణాన్ని అందిస్తాయి. అయితే ఈ నూనెను చర్మ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 
 

నూనెలు కేవలం జుట్టు సంరక్షణకు మాత్రమే ఉపయోగపడతాయి అని చాలామంది భావిస్తారు. నూనెలో విటమిన్లు (Vitamins), మినరల్స్ (Minerals) పుష్కలంగా ఉంటాయి. చర్మసౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని మెరుగు పరచడంతో పాటు శరీరానికి కూడా మేలు చేస్తాయి. నూనెలతో చేసుకొని మసాజ్ లు చర్మకణాలను శుభ్రపరిచి తాజాగా ఉంచుతాయి.

చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం పొడిబారకుండా కాపాడతాయి. చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగిస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని (Smooth skin) అందిస్తాయి. అయితే ఇప్పుడు ఏ నూనెతో చర్మసౌందర్యాన్ని పెంచుతాయా తెలుసుకుందాం.
 

ఆలివ్ నూనె: ఆలివ్ నూనెలో (Olive oil) అధిక మొత్తంలో ఉండే విటమిన్లు, మినరల్స్ (Minerals) జుట్టు, చర్మ సంరక్షణను కాపాడుతాయి. చర్మానికి తగిన పోషకాలు అందించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ నూనె పసిపిల్లల చర్మానికి మరింత మృదుత్వాన్ని అందిస్తాయి. పొడిబారిన చర్మానికి తగినంత తేమను అందించి తాజాగా ఉంచుతుంది. ఈ నూనెను చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.   
 

బాదం నూనె: బాదం నూనె (Almond oil) ఒక మంచి మసాజ్ ఆయిల్ (Good massage oil). ఈ ఆయిల్ చర్మానికి రాసుకుంటే దురద, మంట, అలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ నూనె అన్ని రకాల చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారానికొకసారైనా ఈ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది
 

నువ్వుల నూనె: తేలికగా ఉండే ఈ నువ్వుల నూనెను (Sesame oil) చర్మం తొందరగా పీల్చుకుంటుంది. నువ్వుల నూనె మంచి బాడీ మసాజ్ ఆయిల్. ఈ నూనె చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మాన్ని కోమలంగా మార్చుతుంది. ఈ నూనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా ఉపయోగపడుతుంది.
 

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలు (Coconut oil) ఎక్కువగా జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ నూనె చర్మ సౌందర్యానికి కూడా చక్కగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ ల కారణంగా దెబ్బతిన్న చర్మ కణాలను (Skin cells) తిరిగి పునరుద్ధరణ చేయడానికి కొబ్బరినూనె చక్కగా సహాయపడుతుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరిచి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

click me!