మీ ముఖం జిడ్డుగా ఉందా అయితే ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి!

First Published Nov 27, 2021, 6:14 PM IST

జిడ్డు చర్మ (Oily skin) సమస్యలు అందరినీ బాధిస్తున్నాయి. ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఏర్పడతాయి. ముఖంపై జిడ్డును తగ్గించుకోవడానికి అనేక రూపాయలు ఖర్చు చేసి ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లను వాడుతుంటారు. ఇలా జిడ్డు సమస్య నుంచి బయట పడటానికి అనేక ప్రయత్నాలు చేసిన తగిన ఫలితం లభించదు. ఇందుకోసం ఇంటి చిట్కాలను ఉపయోగించడమే మంచిదని సౌందర్య నిపుణులు (Cosmetologists) తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా జిడ్డు సమస్యలను ఏ విధంగా సహజసిద్ధమైన పద్ధతులలో తగ్గించుకోవాలో తెలుసుకుందాం..
 

జిడ్డు సమస్య ఉన్న వారు ఆయిల్ ఫుడ్ (Oil food) లకు, జంక్ ఫుడ్ (Junk food) లకు దూరంగా ఉండాలి. ఎర్ర మాంసం, పాలతో చేసిన ఉత్పత్తులను, చక్కెర పానీయాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. దోసకాయ, అరటిపండు, పప్పులు, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బ్రోకలీ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజు ఎక్కువ మొత్తంలో మంచి నీటిని తాగాలి. అలాగే జిడ్డు సమస్యలను తగ్గించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
 

దుమ్ము, సూర్య కాంతి (Sunlight) నుంచి ముఖాన్ని రక్షించుకోవాలి. రోజుకు నాలుగు సార్లు మంచి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి ఎక్కువ సార్లు ఫేస్ వాష్ క్రీం (Face wash creams) ను ఉపయోగించడం మంచిది కాదు. ఇలా కొన్ని జాగ్రత్తలను పాటించడంతో జిడ్డు సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కొన్ని ఫేస్ ప్యాక్ లను ఇంటిలోనే తయారుచేసుకుని ఉపయోగించడంతో ముఖం పైన ఉండే అదనపు నూనె తగ్గి చర్మం అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా కనబడుతుంది.
 

రోజ్ వాటర్‌లో (Rosewater‌) యాంటీ మైక్రోబయాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి జిడ్డు సమస్యలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ లో కాటన్ బాల్స్ (Cotton Balls) ను ముంచి వీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవడంతో ముఖంపై  ఉన్న జిడ్డు తగ్గి చర్మం అందంగా, మృదువుగా కనిపిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది.
 

కమలా కాయ తొక్క పౌడర్ తో చేసుకునే ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే అధిక నూనెను తగ్గించి కావలసిన పోషకాలను అందించి చర్మాన్ని మృదువుగా తయారుచేస్తాయి. ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఒక గిన్నె తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ల కమలా కాయ తొక్క పౌడర్ (Orenge peel powder), 4 టేబుల్ స్పూన్ ల పాలు (Milk), ఒక చెంచా కొబ్బరి నూనె (Coconut oil), 2 టీస్పూన్ రోజ్ వాటర్ (Rosewater) వేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి.
 

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టుకొని పొడి చేసుకున్న బాదం (Almonds) మిశ్రమంలో ఒక చెంచా తేనె (Honey) కలుపుకొని ముఖానికి అప్లై చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 4 టేబుల్ స్పూన్లు శెనగపిండి పిండి, 2 టేబుల్ స్పూన్ ల రోజ్ వాటర్, 2 టీస్పూన్ ల తేనె కలిపి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. జిడ్డు సమస్యలు తగ్గి చర్మం అందంగా, మృదువుగా తయారవుతుంది.

click me!