క్యారెట్ ను నిత్యం తీసుకుంటున్నారా అయితే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించండి!

First Published Dec 3, 2021, 7:09 PM IST

క్యారెట్ (Carrot) లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగిఉన్నాయి. క్యారెట్ కు అనేక వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉంది. క్యారెట్ ను తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ కూడా బాగుంటుంది. క్యారెట్ లో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్న క్యారెట్ ను నిత్యం తీసుకుంటే కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా మనం తెలుసుకుందాం..
 

carrot

క్యారెట్ లో విటమిన్లు, పొటాషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, క్లోరిన్, కాల్షియం (Calcium) వంటి ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యారెట్ లోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడంతోపాటు మేధా వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే క్యారెట్ ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

కంటి సంరక్షణ: క్యారెట్ లో విటమిన్ ఏ, బి, ఈ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటికి కావలసిన పోషకాలను (Nutrients) అందించి కంటి చూపు మెరుగు పరచడానికి సహాయపడతాయి. రేచీకటి (Nyctalopia) వంటి కంటి సమస్యలను దరిచేరనివ్వదు

రుతుస్రావ సమస్యలను తగ్గిస్తుంది: మహిళలకు ముఖ్యంగా రుతుస్రావ సమస్యలు (Menstrual problems) చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. నెలసరి సమయంలో మహిళలు అధిక రక్తస్రావం కారణంగా నీరసించి శక్తిని కోల్పోతారు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందడానికి ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ (Carrot Juice) తాగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.   

క్యాన్సర్ ను దరిచేరనివ్వదు: క్యారెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో వ్యాధినిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. క్యాన్సర్ (Cancer) తో పోరాడే శక్తిని అందిస్తుంది. క్యాన్సర్ ను దరిచేరకుండా కాపాడుతుంది. 

గుండె సమస్యలను తగ్గిస్తుంది: క్యారెట్ లో ఉండే పోషకాలు గుండె పనితీరుకు చక్కగా పనిచేస్తాయి. గుండెల్లో మంటగా ఉంటే ఉడకబెట్టి చల్లార్చిన క్యారెట్ రసం (Carrot juice) ఒక కప్పు తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె (Honey) కలిపి సేవించాలి. ఇలా చేయడంతో గుండెల్లో మంట నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

వీర్య వృద్ధి: క్యారెట్ ను రెగ్యులర్ గా తీసుకుంటే పురుషుల్లో వీర్యకణాల (Sperm) సంఖ్య పెరుగుతుంది. అలాగే మహిళల్లో గర్భధారణ సమస్యలను తగ్గించి గర్భం రావడానికి సహాయపడుతుంది. స్త్రీ, పురుషులిద్దరూ నిత్యం క్యారెట్ జ్యూస్ తాగడంతో సంతాన ప్రాప్తి (Parental access) కలుగుతుంది.

చర్మ సంరక్షణ: శరీరంలోని మృత కణాలను (Dead cells) నశింపచేసి చర్మాన్ని మంచి రంగులోకి మారుస్తుంది. చర్మ సౌందర్యాన్ని (Skin beauty) పెంచుతుంది. కమిలిన చర్మానికి తిరిగి పోషకాలను అందించి కాంతివంతంగా మారుస్తుంది. క్యారెట్ రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది: క్యారెట్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడానికి క్యారెట్స్ చక్కగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను (Digestive system) మెరుగు పరచి మలబద్ధకం (Constipation) సమస్యను తగ్గిస్తుంది.

click me!