నానబెట్టిన జీడిపప్పు పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

First Published May 28, 2023, 12:31 PM IST

ఈ పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు పాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి. 
 

cashew milk

మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే జీడిపప్పు మన శరీరంలో పోషకాలను పెంచడానికి సహాయపడుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండే జీడిపప్పును ఎన్నో విధాలుగా తినొచ్చు. వీటిని పాలలో నానబెట్టడం వల్ల మన శరీరం ఎన్నో సమస్యల నుంచి బయటపడుతుంది. జీడిపప్పును పాలలో నానబెట్టడం ద్వారా మెత్తబడతాయి. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. అలాగే పాలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. 

జీడిపప్పులో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొరోనరీ హార్ట్ డిసీజెస్ రాకుండా నివారిస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. వీటిలో ఐరన్, జింక్ కూడా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

Cashew Nut

జీడిపప్పు పాలలో కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది లాక్టోస్ అసహనం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ పాలను తాగితే ఎముకలు బలోపేతం అవుతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. 

ఒక కప్పు జీడిపప్పు పాలలోని పోషక విలువలు

కేలరీలు 25
ప్రోటీన్ 1 గ్రాము కంటే తక్కువగా ఉంటుంది
2 గ్రాముల కొవ్వు
పిండి పదార్థాలు 1 గ్రాము
ఫైబర్ 0
చక్కెర 0

cashew

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఈ మొక్కల ఆధారిత పాలలో పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరమైన కొవ్వులతో పోలిస్తే శరీరానికి మంచి పోషణను అందిస్తాయి. అలాగే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఈ పాలను తాగడం వల్ల శరీరంలో పొటాషియం, మెగ్నీషియం లోపం పోతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పొటాషియం ఎక్కువగా ఉంటే  శరీరంలో స్ట్రోక్ ప్రమాదాన్ని 24 శాతం తగ్గుతుంది. పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. 
 

డయాబెటిస ను నియంత్రిస్తుంది

జీడిపప్పు పాలను తాగడం వల్ల  బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది డయాబెటిస్ తో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. నిజానికి ఈ పాలలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేసే ఈ రకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఈ పాలు లాక్టోస్ రహితంగా ఉంటాయి. దీనిలో పిండి పదార్థాల పరిమాణం తక్కువగా ఉంటుంది. ఆవు పాలకు బదులుగా ఈ పాలను తాగడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెరలు అదుపులో ఉంటాయి. 
 

నాడీ వ్యవస్థకు అవసరం

జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. పాలలో నానబెట్టిన జీడిపప్పును తినడం వల్ల మన శరీరానికి మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది. ఇది శరీరానికి పోషణను అందిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను నిర్వహించడంతో పాటుగా శరీరాన్ని ఒత్తిడి, ఆందోళన నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

ఎముకలను బలంగా ఉంచుతుంది

జీడిపప్పును రాత్రంతా పాలలో నానబెట్టడం వల్ల పాలలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. అలాగే శరీరానికి విటమిన్ కె, విటమిన్ బి 6 లు అందుతాయి. ఇది కీళ్లలో కలిగే నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మోకాలు, నడుము నొప్పితో ఇబ్బంది పడే వారికి ఈ పాలు ఎంతో మేలు చేస్తాయి. 
 

cashew milk

జీడిపప్పు పాలు ఎలా తయారు చేయాలి?

గుప్పెడు జీడిపప్పును ఒక జగ్గు పాలలో రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత జీడిపప్పును పాలలో వేసి మరిగించాలి. ఆ తర్వాత మెత్తని జీడిపప్పు ముక్కలను తిని పాలను తాగండి. జీడిపప్పును ఒకేసారి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. ఎండాకాలంలో వీటిని కొన్నే తినాలి. 

click me!