రోజంతా కష్టపడిన తర్వాత రాత్రి ప్రశాంతంగా నిద్రపడితే చాలా హాయిగా ఉంటుంది. మంచి బెడ్, తల కిందకు దిండు ఉంటే... చాలా మందికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. కానీ.. దిండు వేసుకొని పడుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా..? చాలా మందికి దిండులేనిదే నిద్రపట్టదు. కానీ... ఆ దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే... చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.