షుగర్ ఉన్నవారు పాల చాయ్ తాగొచ్చా?

First Published | Aug 9, 2024, 1:45 PM IST

అసలు డయాబెటీస్ ఉన్నవారు చక్కెరే తినొద్దు. కానీ చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు ఉదయాన్నే పరిగడుపున పాల చాయ్ ని తాగుతుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?
 

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఇది మీ శరీరం ఆహారాన్ని శక్తిగా ఎలా మారుస్తుందో ప్రభావితం చేస్తుంది. షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. బ్లడ్ షుగర్ ఎక్కువైతే ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే డయాబెటీస్ అనేది కోలుకోలేని అనారోగ్య సమస్య. ఈ వ్యాధిలో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని లేదా మీ శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ను ఉపయోగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇన్సులిన్ ఒక ముఖ్యమైన హార్మోన్. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే మీ కణాలు శక్తి కోసం గ్లూకోజ్ ను ఉపయోగించడానికి సహాయపడతుంది. 


డయాబెటిస్ పూర్తి నయం చేసుకోలేని వ్యాధి కాబట్టి.. దీన్ని కొన్ని జీవనశైలి మార్పులతో సులభంగా నియంత్రించొచ్చు. అయితే చాలా మంది డయాబెటీస్ ఉన్నా షుగర్ ను తీసుకుంటుంటారు. ముఖ్యంగా టీ రూపంలో. అందులోనూ ఈ పాల చాయ్ ని ఉదయాన్నే పరిగడుపున తాగుతుంటారు. అసలు ఇలా తాగొచ్చా? తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


షుగర్ ఉన్నవారు పరిగడుపున మిల్క్ టీ తాగొచ్చా? 

డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల గుర్తించబడుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయి లేనిపోని రోగాలు వస్తాయి. అయితే కొన్ని ఆహారాలు, పానీయాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయి. మరికొన్ని షుగర్ ను పెంచుతాయి. దీనిలో టీ కూడా ఉంది. 
 


డయాబెటీస్ ఉన్నవారు మిల్క్ టీని తాగకపోవడమే మంచిది. ఆయుర్వేదం ప్రకారం.. ఖాళీ కడుపుతో పాల టీని తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.  ఇది డయాబెటీస్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. టీ లో ఉండే కెఫిన్ మీ రక్తంలో చక్కెర అసమతుల్యతను మరింత పెంచుతుంది. ఇది డయాబెటిస్ తో సంబంధం ఉన్న అసౌకర్యం,  అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. 
 

ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

అజీర్ణం
కడుపు ఉబ్బరం, ఎసిడిటీ 
బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులు
 

ఆరోగ్యంగా ఉండటానికి మిల్క్ టీ ఎలా తాగాలి?

మిల్క్ టీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గనుకు మీరు మిల్క్ టీని మొత్తమే తాగకూడదు అనుకునే అవకాశం ఉంది. అయితే ఆయుర్వేదం ప్రకారం.. మిల్క్ టీని మితంగా తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. డయాబెటిస్ ఉన్నవారురక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి మితంగా తాగాలి. అది కూడా భోజనం చేసిన తర్వాతే పాల చాయ్ ని తాగాలి. 

Latest Videos

click me!