ఆడవాళ్లు పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 19, 2023, 7:15 AM IST

కొంతమంది పాలను రోజూ తాగుతారు. ఇంకొంతమంది మొటిమలు అవుతాయి, శరీరంలో మంట పెరుగుతుందని పాలకు దూరంగా ఉంటుంది. కానీ పాలను మోతాదులో తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆడవాళ్లు పాలను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పాలు, పాల ఉత్పత్తులు మొటిమలకు కారణమవుతాయని కొంతమంది నమ్ముతుంటారు. అలాగే పాలను తాగితే శరీరంలో మంట కలుగుతుందని అంటుంటారు. కానీ పాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతారు. లాక్టోస్ అసహనం లేనివారికి లేదా పాలకు అలెర్జీ లేనివారికి పాలు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు పోషకాలు పుష్కలంగా ఉండే పాలను తాగడం వల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పోషకాలు 

నిపుణుల ప్రకారం.. 1 కప్పు పాలలలో  2శాతం ఆరోగ్యకరమైన కొవ్వు, 122 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంలాగే 3 గ్రాముల సంతృప్త కొవ్వు, 12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 12 గ్రాముల సహజ చక్కెరలు కూడా ఉంటాయి. ఈ మొత్తం పాలలో విటమిన్ బి 12 మన రోజువారీ అవసరాలలో 50%, రోజువారీ కాల్షియం అవసరాలలో 25%, పొటాషియం, విటమిన్ డి 15% తీరుస్తుంది. బాదం లేదా చిరుధాన్యాల పాలు వంటి ఎన్నో పాలేతర పాల ప్రత్యామ్నాయాల కంటే ఇది చాలా శక్తివంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 


Drinking milk

ఎముకల ఆరోగ్యానికి 

పాలు పోషకాలకు మంచి వనరు. వీటిలో కాల్షియం, విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు మన ఎముకల ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. కాల్షియం ఒక ఖనిజం. ఇది మన ఎముకలను బలంగా ఉంచడానికి అవసరం. విటమిన్ డి శరీరం తినే ఆహారాల నుంచి కాల్షియాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. పాలు జీవితాంతం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

milk

వెయిట్ లాస్ 

బరువు తగ్గడానికి లేదా బరువు పెరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్న వారికి పాలు ఎంతో మేలు చేస్తాయి. క్రమం తప్పకుండా పాలను తాగితే తేడాను మీరే చూస్తారు. పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇందుకు సహాయపడతాయి. పాలలోని ప్రోటీన్,  కొవ్వు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. దీనిలోని పిండి పదార్థాలు మీకు శక్తిని అందిస్తాయి. శరీరం ఇంకా బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. పాలు మీ ఆకలిని తగ్గిస్తాయి. తొందరగా కడుపును నింపుతాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు తక్కువ కొవ్వున్న పాలను తాగితే బరువు తగ్గుతారు. 

milk

డయాబెటిస్

పాలను తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబెతున్నారు. దాదాపుగా 600,000 మందిపై జరిపిన అధ్యయనం విశ్లేషణలో.. మొత్తం పాల వినియోగం డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. అంటే పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. కాకపోతే పాలలో చక్కెరను వేయకుండా తాగాలి. 
 

గుండె ఆరోగ్యానికి

క్రీమ్ లెస్ లేదా తక్కువ కొవ్వు పాలలలో ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉంటుంది. పాలలో పొటాషియం కూడా ఉంటుంది. ఇది గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు  రాకుండా కాపాడుతుంది. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్నికూడా తగ్గిస్తుంది. అయితే ఎక్కువ  కొవ్వు పాలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఇది సంతృప్త కొవ్వు. హృద్రోగులు ఇతర ఆహారాల మాదిరిగానే దీనిని లిమిట్ లో  తీసుకోవాలి. 

అభిజ్ఞా క్షీణతకు 

మీ వయస్సులో మీరు మానసికంగా మరింత చురుగ్గా ఉండటానికి కూడా పాలు సహాయపడతాయి. పాలను తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్కిమ్డ్ డెయిరీ, పులియబెట్టిన పాలు, మజ్జిగ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ లో కొన్ని పాలను కలుపుకుని తినొచ్చు. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి 12 కు మంచి మూలం. ఇవి వృద్ధులకు అవసరమైన పోషకాలు. 

Latest Videos

click me!