Aloe Vera Juice: ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. చర్మం, జుట్టు మెరిసిపోతుంది! బరువు తగ్గిపోతారు!

Published : Feb 24, 2025, 01:53 PM IST

కలబంద జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని మెరిపించడంలోనూ, బరువు తగ్గించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ కలబంద జ్యూస్ రోజు తాగితే ఏమవుతుందో మీకు తెలుసా? అందులోనూ ఖాళీ కడపున తాగితే ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.

PREV
15
Aloe Vera Juice: ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. చర్మం, జుట్టు మెరిసిపోతుంది! బరువు తగ్గిపోతారు!

చాలామంది అధిక బరువు, జుట్టు రాలడం, పొడిచర్మం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీని కోసం రకరకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. కానీ కలబంద జ్యూస్ ఎప్పుడైనా ట్రై చేశారా? కలబంద రసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా, అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం.

25
పోషకాలు:

కలబందలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఫోలిక్ ఆమ్లం కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

35
మొటిమలు:

కలబందలో అలర్జీ నిరోధక, వృద్ధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. కలబంద జ్యూస్ తాగడం ద్వారా మొటిమలను కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది. మొటిమల వల్ల వచ్చే నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మ ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి:

కలబంద జ్యూస్ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం కలబంద జ్యూస్‌లో కలిపి తాగితే, ఊబకాయం తగ్గే అవకాశం ఉందట.

45
జీర్ణక్రియ:

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కలబంద జ్యూస్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వాపు : 

శరీరంలో వచ్చే వాపును తగ్గించడానికి కలబంద జ్యూస్ సహాయపడుతుంది. ఇందులో ఉండే అలర్జీ నిరోధక, బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు శరీరంలో వచ్చే వాపును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

55
జుట్టు:

కలబంద రసంతో ఉసిరికాయ కలిపి రుబ్బుకుని తాగితే జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది.

నోటి సంబంధిత సమస్యలు:

నోటి సంబంధిత సమస్యతో బాధపడుతుంటే కలబంద జ్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే రోగనిరోధక లక్షణాలు దంత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories