మెరుగైన చర్మ ఆరోగ్యం
మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం వల్ల మీ చర్మ ఆరోగ్యం, రూపం మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీరు మీ చర్మాన్ని మృదువుగా, తేమగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది పొడి, పగిలిన మడమలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే వాటర్ లో టీ ట్రీ ఆయిల్ లేదా పిప్పరమింట్ ఆయిల్ వంటి పదార్థాలను కలిపితే ఇంకా మంచిది. ఎందుకంటే ఇవి అంటువ్యాధులను నివారించడానికి, మీ పాదాలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి.