జబులు, ప్లూలను చిటికెలో మాయం చేసే ఆయుర్వేద చిట్కాలు.. ట్రై చేయండి..

First Published Jun 16, 2021, 12:16 PM IST

వర్షాకాలం ప్రారంభమయ్యింది. వాతావరణం చల్లబడడంతోపాటు.. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఏ చిన్న జలుబు,దగ్గు వచ్చినా వణికిపోవడం మామూలైపోయింది. 

వర్షాకాలం ప్రారంభమయ్యింది. వాతావరణం చల్లబడడంతోపాటు.. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఏ చిన్న జలుబు,దగ్గు వచ్చినా వణికిపోవడం మామూలైపోయింది.
undefined
అలాంటి భయాలకు దూరంగా ఉండాలంటే.. జలుబు, దగ్గు, ఫ్లూ.. ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని ఆయుర్వేదిక చిట్కాలు ఉపయోగిస్తే చాలు.
undefined
చెవిలో నూనె : ఆవనూనె లేదా నువ్వుల నూనె ప్రతి వంటింట్లోనూ ఉండేది. ఈ నూనెను కొన్ని చుక్కలు చెవుల్లో వేయాలి. చెవిలో నూనె వేయడం ఆయుర్వేదాన్ని అనుసరించే వారి దినచర్యలో బాగంగా ఉంటుంది.
undefined
ఇలా చెవిలో నూనె వేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెవి డ్రై కాకుండా ఉంచుతుంది. చెవిలో నూనె వేయడం వైరల్ సంక్రమణను నివారించడానికి ఒక గొప్ప మార్గం.
undefined
పసుపులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉంటాయి. అందుకే వైరస్ అదుపులోనూ పసుపు గొప్ప ఔషధంగా వాడుతుంటారు. ఇందలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జలుబు, దగ్గును నయం చేయడంలో సహాయపడుతుంది.
undefined
ఎలా తీసుకోవాలి అంటే.. ముడి తేనె, పొడి పసుపు కలిపి పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
undefined
అశ్వగంధ : అంతులేని ప్రయోజనాలతో కూడిన సూపర్ ఫుడ్ అశ్వగంధ. దీంట్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. ఇది జలుబు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
undefined
వైరల్ సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది పౌడర్లు, టాబ్లెట్లతో సహా అనేక రూపాల్లో లభిస్తుంది. అశ్వగంధ దీర్ఘకాలిక ఒత్తిడి, అలసటను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది.
undefined
కషాయం : ఆయుర్వేదంలో కషాయం అనేది సహజ రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్, ఇది శరీరాన్ని అంటువ్యాధులపై పోరాడటానికి సిద్ధం చేస్తుంది. కషాయం రోగనిరోధక శక్తిని పెంచే, శోథ నిరోధక, రక్షణ పదార్ధాల మిశ్రమం,
undefined
దీంట్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
undefined
click me!