చలికాలం వచ్చేసింది. ఈ సీజన్ లో మనం తినే ఆహారం, చర్మం, జుట్టు మొదలైన వాటిపై తగిన ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే మన చర్మం, వెంట్రుకలు నిర్జీవంగా మారుతాయి. అలాగే చలినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ సీజన్ లో వేడివేడి పదార్థాలు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీజన్ మారినప్పుడల్లా మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సీజన్ లో పెరుగును తినకూడదని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. ఈ సీజన్ లో పెరుగు తిన్నా, మజ్జిగను తాగినా జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయని నమ్ముతారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..