విటమిన్ బి12 లోపం ప్రాణాంతకం.. ఈ లక్షణాలను గుర్తిస్తేనే మీరు సేఫ్..!

మన శరీరానికి విటమిన్ బి12 చాలా ముఖ్యమైన, అవసరమైన పోషఖం. ఇది మన శరీరంలో ఎన్నో విధులను నిర్వహిస్తుంది. ఈ లోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని మొదట్లోని గుర్తించి చికిత్స తీసుకోవాలి. 

vitamin b12 deficiency

మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. అందులో ఏ ఒక్కటి తగ్గినా మన శరీరం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి వాటిలో విటమిన్ -బి12 ఒకటి. ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడం లేదా ఈ విటమిన్ ను మీ శరీరం గ్రహించనప్పుడు మీలో విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని పట్టించుకోకపోతే మీ ప్రాణాల మీదికి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఈ సంకేతాలను పట్టించుకోకుండా వదిలేస్తే ఎన్నో డేంజర్ వ్యాధులొస్తాయి. ఈ లోపం ఎన్నో శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి12 మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, డీఎన్ఎను తయారు చేయడానికి సహాయపడుతుంది.

Learn the benefits of vitamin B12, which helps the heart and brain stay fit

అయితే మన శరీరం దానంతట అదే  విటమిన్ -బి 12 ను తయారు చేయదు. అందుకే దీన్ని ఫుడ్ ద్వారా తీసుకోవాలి. పాలు, మాంసం మొదలైన జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలలో  విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అసలు విటమిన్ బి12 లోపం లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 


అలసట

అలసట విటమిన్ -బి12 లోపం లక్షణం. విటమిన్ బి12 రక్తం తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇక ఈ పోషకం లోపిస్తే రక్తం ఏర్పడటం తగ్గుతుంది, దీని వల్ల మీ శరీరం బలహీనంగా  ఉంటుంది. బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు దీనివల్ల రక్తహీనత సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. 

vitamin b12

చర్మం రంగు మారడం

విటమిన్ -బి12 లోపం వల్ల ఎర్రరక్తకణాలు ఏర్పడటం తగ్గుతుంది. దీంతో మీకు రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల మీ చర్మం రంగు పాలిపోవడం మొదలవుతుంది. శరీరంలో రక్తం తగ్గడం వల్ల మీ చర్మం రంగు పసుపు రంగులో కనిపిస్తుంది. 
 

swollen tongue

నాలుక వాపు

నాలుక వాపు కూడా విటమిన్ బి 12 లోపం లక్షణమేనంటున్నారు నిపుణులు. దీనిని గ్లోసిటిస్ అంటారు. దీనిలో మీ నాలుక రంగు కూడా మారుతుంది. అంటే ఎర్రగా మారుతుంది. ఈ వ్యాధితో మీ నోట్లో బొబ్బలు కూడా ఏర్పడతాయి. 
 

vitamin b12

నడవడానికి ఇబ్బంది

విటమిన్ -బి12 లోపం వల్ల నడవడానికి ఇబ్బంది కూడా కలుగుతుంది. విటమిన్ బి12 లోపించడం వల్ల మీ నరాలు దెబ్బతింటాయి. న్యూరోట్రాన్స్మిటర్లను తయారు చేయడానికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ లోపం వల్ల అవి ప్రభావితం అవుతాయి. ఈ లోపం వల్ల మీ పాదాలలో జలదరింపు అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు నడవడానికి ఇబ్బంది పడతారు. 

memory loss

జ్ఞాపకశక్తిని కోల్పోవడం

విటమిన్-బి12 నేరుగా మెదడుకు సంబంధించినది. ఇది తగ్గినా, పూర్తిగా లేకపోయినా.. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!