అరటి తొక్కతో కూడా ఇన్ని లాభాలున్నాయా?

First Published | Sep 14, 2023, 1:11 PM IST

అరటితొక్కను వెన్నతో కలిపి తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. అరటి తొక్కలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి..
 


ప్రతిరోజూ ఒక అరటి పండు తినడం మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు.  రోజూ ఒక అరటిపండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ పండు శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. 

Image: Freepik

మనమందరం అరటి పండు తొక్క తీసేసి, పండు తింటూ ఉంటాం. అయితే, పండుతో పాటు, తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదట.  ఈ తొక్కలు చర్మ సంరక్షణకే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అరటితొక్కను వెన్నతో కలిపి తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. అరటి తొక్కలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి..
 

Latest Videos



జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

అరటి తొక్కలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అరటి తొక్కల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని కూడా పోగొడుతుంది. 
 


అధిక రక్తపోటును తగ్గిస్తుంది

అధిక రక్తపోటు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే అరటి తొక్కలను తింటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అరటి తొక్కలో ఫైబర్ కంటెంట్ తో పాటుగా పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అరటి పండ్లను తొక్కతో సహా రోజూ తింటే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. హైబీపీ పేషెంట్లు తొక్కను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. 


ఎముకలు బలంగా ఉంటాయి

అరటి తొక్కలు ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి. అరటిపండ్లలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అందుకే రోజూ ఒక అరటిపండును పిల్లలకు తినిపించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు అరటిపండును తొక్కతో సహా తినడం మంచిది. 
 

banana peels

కళ్లు  ఆరోగ్యంగా ఉంటాయి

అరటి తొక్క కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపర్చడంతో పాటుగా కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.


మెటిమలు తగ్గుతాయి

అరటి తొక్క మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం అరటితొక్క లోపలి తెల్లని భాగాన్ని ముఖంపై నిమిషం పాటు రుద్దండి. 30 నిమిషాల తర్వాత నీటితో మీ ముఖాన్ని నీట్ గా కడుక్కోండి. తరచుగా ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటుగా చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఇలా కాకుండా ఓట్స్, అరటి తొక్కలతో ప్యాక్ తయారు చేసుకుని కూడా ముఖానికి అప్లై చేయొచ్చు. ఇందుకోసం ఒకటిన్నర కప్పుల ఓట్స్ ని తీసుకోండి. ఒక అరటిపండు తొక్కను పేస్ట్ చేసి దానిలో.. ఓట్స్, చక్కెరను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.

click me!