ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫోన్ లేకుండా క్షణ కాలం కూడా ఉండలేని వారు చాలా మందే ఉన్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం దీన్ని విచ్చల విడిగా ఉపయోగిస్తారు. ఉదయం కళ్లు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ మొబైల్ జనాల చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ను ఎక్కువగా చూస్తుంటారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ అంటే ఎన్నింటినో స్క్రోల్ చేస్తుంటారు.
ఈ ఫోన్ వాడుతుంటే సమయం కూడా తెలియదు. ఎన్ని గంటలు గడిచిపోతాయో కూడా తెలియదు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ అలవాటు మీ మానసిక ఆరోగ్యాన్నే కాదు మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తుంది. అసలు ఫోన్ వాడకం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకటి ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మీ కళ్లను దెబ్బతీస్తుంది.
అలాగే మీ నిద్ర దెబ్బతింటుంది. రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టుదు. దీంతో మీ డే అంతా గజిబిజిగా, ఒత్తిడిగా మారుతుంది.
ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేస్తూ కాసేపు మొబైల్ పనిచేయకపతే మీరు పడే కంగారు అంతా ఇంతా కాదు. దీనితో మీలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.
గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మీ చేతులు, భుజం కండరాలపై చెడు ప్రభావం పడుతుంది.
అతి వాడకాన్ని ఎలా తగ్గించాలి?
మొబైల్ ఫోన్ ను యూజ్ చేయడానికి ఒక సమయాన్ని సెస్ చేసుకోండి. అంటే రాత్రి పది గంటల తర్వాత నెట్ ను ఆఫ్ చేయాలనే రూల్ పెట్టుకోండి. దీనివల్ల మీకు ఒకటి లేదా రెండు వారాలు కష్టంగా రోజులు గడుస్తాయి. మీ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. చేతులు ఖాళీగా కూడా అనిపిస్తాయి. కానీ ఇది అలవాటైన తర్వాత మీరు ఎంతో ప్రశాంతంగా, తొందరగా నిద్రపోతారు. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
నోటిఫికేషన్ ఆఫ్ చేయండి
నోటిఫికేషన్ల వల్లే చాలా మంది ఫోన్ ను అతిగా వాడుతారు. మొబైల్ లో మెసేజ్ టోన్ మోగగానే ఏమోచ్చందని వెంటనే చెక్ చేస్తారు. దాన్ని చూడాలనే ఇష్టం మీకు లేకపోయినా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. అందుకే నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి.
అనవసరమైన సోషల్ మీడియా యాప్స్ ను డిలీట్ చేయండి. అలాగే మీరు మొబైల్ లో స్క్రోల్ చేసేటప్పుడు స్క్రీన్ బ్రైట్ నెస్ ను పూర్తిగా తగ్గించండి. దీంతో మీ కళ్లపై ఎక్కువ ప్రభావం పడదు. అలాగే పడుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి.