నెయ్యి ఎందుకు సూపర్ ఫుడ్?
నెయ్యి భారతీయ వంటశాలలలో ఖచ్చితంగా ఉపయోగించే ఒక పదార్థం. పోషకాలు ఎండుగా ఉండే సూపర్ ఫుడ్ నెయ్యి. అందుకే దీనిని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఆహారంతో పాటుగా మతపరమైన ఆచారాలు, ఆయుర్వేదం, మందులు మొదలైన వాటికి కూడా నెయ్యిని ఉపయోగిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. అసలు నెయ్యి కలిపిన వేడినీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..