Health Tips: పొద్దు పొద్దున్నే వీటిని అస్సలు తినకండి

First Published | Nov 22, 2023, 7:15 AM IST

Health Tips: మీరు ఉదయం తినే ఆహారమే మిమ్మల్ని రోజంతా ఆరోగ్యం, ఎనర్జిటిగ్ గా ఉంచుతుంది. కానీ ఉదయం పూట కొన్ని రకాల ఆహారాలను తింటే మాత్రం మీరు నీరసంగా ఉండటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే  ఇలాంటి వాటిని తినకూడదు. అవేంటో చూద్దాం పదండి.
 

మనం పొద్దున్నే ఏం తింటున్నామనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తివంతంగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. మనం ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఆహారాలు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అయితే ఉదయం పూట కొన్ని రకాల ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

Donuts

పేస్ట్రీలు, డోనట్స్

పేస్ట్రీలు, డోనట్స్ ను ఉదయం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ వీటిని మార్నింగ్ అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన ధాన్యాలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తింటే మీ శరీరంలో శక్తి తగ్గుతుంది.
 

Latest Videos


Image: Getty Images

ప్రాసెస్ చేసిన ఆహారం

ఉదయాన్నే ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మీ శక్తి స్థాయిలను తగ్గించడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను అస్సలు తినకండి.

pan cake

పాన్ కేక్

చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉన్న పాన్ కేక్ లను కూడా పొద్దు పొద్దున్నే తినకూడదు. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అందుకే వీటిని తినకండి. 

పానీయాలు

పొద్దు పొద్దున్నే కేలరీలు, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను కూడా ఉదయాన్నే తాగడం మానుకోండి. మార్కెట్ లో దొరొకే పండ్ల రసాలలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిని ఉదయాన్నే తాకండి. 
 

వైట్ బ్రెడ్

టీ, కాఫీ లో పాటుగా వైట్ బ్రెడ్ ను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ వీటిని ఉదయాన్నే అస్సలు తినకూడదు. ఉదయాన్నే కాదు వీటిని అస్సలు తిననేకూడదు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కవుగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచడమే కాదు, మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతాయి. అందుకే ఉదయాన్నే ఇలాంటి వాటిని తినకండి. 
 

ఆయిలీ ఫుడ్

ఉదయాన్నే నూనెలో వేయించిన, వేయించిన ఆహార పదార్థాలను తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను బాగా పెంచుతాయి. 

పచ్చి కూరగాయలు

ఉడకని అంటే పచ్చి కూరగాయలను కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. పచ్చి కూరగాయలను సలాడ్ ను, పండ్ల సలాడ్ గా తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఉదయాన్నే వీటిని తినకండి. 

జున్ను, పనీర్

జున్ను, పనీర్ ఉన్న ఆహారాలను కూడా మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోకండి. ఎందుకంటే ఇవి మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది మీకు గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. 

ఇలాంటి పెరుగు

కృత్రిమ రుచులు, స్వీటెనర్లు ఉన్న పెరుగును కూడా ఉదయాన్నే తినకూడదు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.

click me!