వామును తింటే ఇన్ని సమస్యలు తగ్గిపోతాయా?

Published : May 21, 2023, 12:22 PM IST

వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ చాలా మంది దీన్ని ఒక మసాలా దినుసులాగే తీసుకుంటారు. నిజానికి వాము ఎన్నో రోగాలను తగ్గిస్తుంది కూడా.   

PREV
17
వామును తింటే ఇన్ని సమస్యలు తగ్గిపోతాయా?

అజ్వైన్ లేదా వాము ఒక సాధారణ భారతీయ మసాలా దినుసు. దీన్ని కూరలు, పరాఠా స్టఫింగ్, సమోసాలు, పకోడీలు వంటి ఎన్నో వంటకాల్లో రుచిని పెంచడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వాము శక్తివంతమైన క్లెన్సర్ గా పరిగణించబడుతుంది. ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను పోగొడుతుంది. 
 

27

ఫుడ్ పాయిజనింగ్ లేదా ఎసిడిటీ సమస్యలను తగ్గించుకోవడానికి వాము వాటర్ ను లేదా చిటికెడు ఉప్పుతో వేయించి తీసుకోవాలి. ఈ శక్తివంతమైన విత్తనాలను పాలిచ్చే తల్లుల ఆహారంలో కూడా కలుపుతారు, ఎందుకంటే ఇది వారిని త్వరగా కోలుకునేలా చేయడానికి సహాయపడుతుంది. మన శరీరంలో రోజువారీ సమస్యలను ఎదుర్కోవటానికి వాము ఎంతో సహాయపడుతుంది. వామును తింటే ఎలాంటి సమస్యలు తగ్గిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

37

బహిష్టు తిమ్మిరి నుంచి ఉపశమనం

పీరియడ్స్ రావడం సర్వ సాధారణం. కానీ ఇది  కొంతమంది ఆడవారిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. పీరియడ్స్ లో కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించుకోవడానికి  వాము వాటర్ ఒక ఎఫెక్టివ్ రెమెడీ. అజ్వైన్ వాటర్ తయారు చేయడానికి 1/2 టేబుల్ స్పూన్ వాము,  1/2 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ను మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో కలపండి. ఇది పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
 

47

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది

వాము రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి. అందుకే వామును డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వామును కూరలకు, రోటీలకు కలపొచ్చు. లేదా భోజనం తర్వాత తినొచ్చు. మీ భోజనంలో అజ్వైన్ జోడించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇది మీ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

57

ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం

శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాల కారణంగా ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, హషిమోటో వంటి స్వయం ప్రతిరక్షక రుగ్మతల లక్షణాలను తగ్గించడానికి వాము ఎంతో సహాయపడుతుంది. దీని ప్రయోజనాలను పొందడానికి పానీయాలు, కూరలు, పరాఠాలలో  వామును వేయండి. 

67

జీర్ణ సమస్యలు

వామును ఉపయోగించడం వల్ల అపానవాయువు, అజీర్ణం, కడుపు ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. వామును నీటిలో కొన్ని నిమిషాల పాటు మరిగించి తాగితే జీర్ణ సమస్యలు మటుమాయం అవుతాయి. 
 

77

తల్లులకు సహాయపడుతుంది

కొత్తగా తల్లులైన వారికి కూడా వాము ఎంతగానో సహాయపడుతుంది. పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది వారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories