ఈ ఒక్క తప్పే మీరు బరువు తగ్గకుండా చేస్తుంది

First Published | Aug 29, 2024, 11:51 AM IST

వెయిట్ లాస్ అవ్వాలని రోజూ వ్యాయామం చేస్తుంటారు. రెగ్యులర్ డైట్ ను కూడా ఫాలో అవుతుంటారు. అయినా కొంతమంది కొంచెం కూడా బరువు తగ్గరు. దీనికి కారణమేంటో తెలుసా? 
 

నేటి కాలంలో బరువు తగ్గడమొక సవాలుగానే మారిపోయింది. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తుంటారు. అంటే సరైన ఆహారం తింటారు. హెల్తీ డ్రింక్స్ నే తాగుతారు. జిమ్ వెళ్లడమో, రోజూ వాకింగ్, వ్యాయామాలను చేయడమో చేస్తుంటారు. అయినా ఇంచు బరువు కూడా తగ్గరు. నిజానికి ఒక్కోసారి మీరు చేసే ఒక చిన్నపొరపాటు కూడా మీరు బరువు తగ్గడానికి పెద్ద అడ్డంకిలా మారుతుంది. అలాంటిదే ఒక అలవాటు కూడా మీరు బరువు తగ్గడానికి అడ్డుపడుతుంది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి. 
 

ఒత్తిడికి గురైతే మాత్రం మీరెంత కష్టపడినా, ఎన్ని డైట్లు ఫాలో అయినా కొంచెం కూడా బరువు తగ్గరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒత్తిడి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. మీరు పగలు, రాత్రి ,నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించినప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. 
 


Stress

ఈ కార్టిసాల్ హార్మోన్ మీ జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా మీ పొట్ట చుట్టూ. దీనివల్ల మీరు బరువు తగ్గడం ఇంపాజిబుల్ అవుతుంది. 
 

మీకు తెలుసా? ఎప్పుడూ ఒత్తిడికి లోనయ్యేవారు బాగా తినడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉండే అనారోగ్యకరమైన ఆహారాన్నే ఎక్కువగా తింటారు. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒత్తిడికి లోనైనప్పుడు నిద్ర పట్టదు. దీనివల్ల మీ మెటబాలిజం దెబ్బతింటుంది. దీనివల్ల శక్తిని ఉపయోగించే మీ శరీర సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇది మీరు బరువు తగ్గకుండా చేస్తుంది. 
 

Stress

కార్టిసాల్ హార్మోన్ కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది. టెస్టోస్టెరాన్ తో పాటుగా ప్రొజెస్టెరాన్ కూడా కొలెస్ట్రాల్ నుంచే తయారవుతుంది. కార్టిసాల్ హార్మోన్ పెరిగితే కొలెస్ట్రాల్ ను ఎక్కువగా వాడుతారు. దీనివల్ల ఇతర హార్మోన్లకు కొలెస్ట్రాల్ రావడం కష్టమవుతుంది. దీని వల్ల టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ తగ్గుతాయి. ఈ అసమతుల్యత వల్ల మీ పొట్ట మరింత పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయండి. అప్పుడే మీరు బరువు తగ్గుతారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.

Latest Videos

click me!