Heart: అలసట, తల తిరగడం, చెమట పట్టడం గుండెపోటుకు సంకేతాలా?

Published : Feb 05, 2025, 08:18 PM IST

మన శరీరంలాగే, గుండె కూడా అలసిపోతుంది. అలాంటప్పుడు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే గుండెె ఆగిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఆ సంకేతాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.  

PREV
18
Heart: అలసట, తల తిరగడం, చెమట పట్టడం గుండెపోటుకు సంకేతాలా?

సాధారణంగా ఎక్కువ పనిచేసినప్పుడు శరీరం అలసిపోతుంది. రెస్ట్ కావాలి అనిపిస్తుంది. అలాగే ఒత్తిడి ఎక్కువైనప్పుడు గుండె అలసిపోతుంది. గుండెకు కూడా విశ్రాంతి అవసరం. చాలామంది గుండెకు రెస్ట్ ఇవ్వరు. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.

28
ఛాతీలో నొప్పి వస్తే..

గుండెకు ఎప్పుడు విశ్రాంతి అవసరమో తెలిపే సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాతిలో నొప్పి లేదా టైట్ గా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇది గుండె అలసిపోయిందని, విశ్రాంతి అవసరమని సూచిస్తుంది.

38
ఊపిరి తీసుకోవడం కష్టమైతే..

వ్యాయామం చేసేటప్పుడు లేదా పడుకునేటప్పుడు ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటుంటే.. గుండె అలసిపోయిందని అర్థం. అప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

48
విపరీతమైన అలసట

ఎలాంటి కారణం లేకుండా అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపిస్తే, అది అలసిన గుండెకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

58
చెమట పడితే..

వ్యాయామం చేయకుండా, నార్మల్ టెంపరేచర్ లో కూడా ఎక్కువగా చెమట పడుతుంటే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్‌ని వెంటనే కాంటాక్ట్ కావడం మంచిది.

68
తల తిరగడం

తరచుగా తలతిరగడం, మూర్ఛపోవడం కూడా గుండె అలసిపోయిందని చెప్పడానికి సంకేతం. క్రమరహిత హృదయ స్పందన కూడా అలసిన గుండెకు సంకేతం కావచ్చు.

78
నిద్రలేమి

నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యను పరిష్కరించుకోవడానికి డాక్టర్‌ని సంప్రదించి సలహా తీసుకోవాలి.

88
ఆరోగ్యకరమైన ఆహారం

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, ప్రోటీన్, ఫైబర్ లాంటివి ఉండాలి. నూనె, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి.

click me!

Recommended Stories