Mayonnaise: మయోనైజ్ తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా?

Published : Feb 05, 2025, 07:18 PM IST

మయోనైజ్ ఇదొక కొత్తరకమైన వంటకం. ఇదొక క్రీం లాంటి పదార్థం. సాధారణంగా మనం టమోట సాస్, చిల్లీ సాస్ ఎలా వాడతామో మయోనైజ్ ను కూడా పిజ్జా, బర్గర్ తినేటప్పుడు అలాగే వాడతారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

PREV
15
Mayonnaise: మయోనైజ్ తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా?

ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయోనైజ్. ఇదొక రకమైన క్రీం లాంటి పదార్థం. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, చిప్స్ ఇలా ఏం తిన్నా పక్కన ఈ మయోనైజ్ ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే మయోన్నైస్ చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

25
మయోనైజ్ తింటే గుండెపోటు వస్తుందా?

మయోనైజ్ లో వెజ్, నాన్ వెజ్ అని రెండు రకాలు ఉంటాయి. అందులో పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్ ఒకటి. సాధారణంగా మయోనైజ్ తయారు చేయడానికి చాలా నూనె వాడాల్సి ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా దీన్ని తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు. మయోనైజ్ తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందట.

35
మయోనైజ్ ఎక్కువగా తింటే..

నిపుణుల సూచన ప్రకారం మయోనైజ్ తింటే నేరుగా గుండెపోటు రాదట. ఎక్కువగా తింటే మాత్రం గుండెకు మంచిది కాదట. మయోనైజ్ లో ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు హానికరం. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి, ధమనుల్లో అడ్డంకీ ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట.

45
బరువు పెరుగుతారు

మయోనైజ్ లో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బీపీ పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. మయోనైజ్ లో పోషకాలు తక్కువ. కేలరీలు ఎక్కువ. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. బరువు పెరగడం వల్ల చాలా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

మయోనైజ్ లో గుడ్లను అధికంగా ఉపయోగిస్తారు. కొంతమందిలో ఇది అలెర్జీలకు దారితీస్తుంది. తిన్న వెంటనే అలెర్జీ లక్షణాలు కనబడ్డాయంటే ఇంకోసారి దాన్ని తినకపోవడమే మంచిదనే విషయాన్ని గుర్తించాలి.

 

55
బీపీ, గుండెపోటు ఉంటే మయోనైజ్ తినొచ్చా?

ఒకవేళ ఇప్పటికే గుండె, బీపీ సమస్యలు ఉంటే, దీన్నితినకపోవడమే మంచిది. లేదా డాక్టర్ చెప్పినంత మాత్రమే తినాలి. మయోనైజ్ తినేటప్పుడు తప్పనిసరిగా ఎంత తింటున్నామో గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎంచుకోవడమే ఉత్తమం.

 

click me!

Recommended Stories