Eating Apple: ఆపిల్ తిని.. నీళ్లు తాగుతున్నారా?

Published : Feb 05, 2025, 03:48 PM IST

మనం ఎక్కువగా తినే పండ్లలో ఆపిల్స్ ఒకటి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం రెగ్యులర్ గా తింటూ ఉంటాం. కానీ ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదట మీకు తెలుసా? ఎందుకు తాగవద్దో ఇక్కడ చూద్దాం.

PREV
15
Eating Apple: ఆపిల్ తిని.. నీళ్లు తాగుతున్నారా?

రోజూ ఒక ఆపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. ఆపిల్ లో పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి6 లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆపిల్ తిన్న వెంటనే నీళ్ళు తాగొచ్చా? తాగకూడదా? తాగితే ఏమవుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది.

25
ఆపిల్ తిన్నాక..

ఆపిల్ తిన్న వెంటనే నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆపిల్ తిన్న తర్వాత నీళ్ళు ఎందుకు తాగకూడదో వారి మాటాల్లోనే తెలుసుకుందాం.

35
ఎందుకు తాగకూడదు?

మన జీర్ణకోశంలో సాధారణ pH స్థాయి క్షార గుణం కలిగి ఉంటుంది. ఆపిల్ తిన్న వెంటనే నీళ్ళు తాగితే, అది pH స్థాయిని దెబ్బతిస్తుంది. నీరు pH స్థాయిని తగ్గిస్తుంది. పండ్లలో సహజంగా చక్కెర, ఈస్ట్ ఎక్కువగా ఉంటాయి. పండు తిన్న వెంటనే నీళ్ళు తాగితే, అది జీర్ణకోశంలో ఆమ్లాన్ని నీరుగా మారుస్తుంది. దీనివల్ల ఈస్ట్ పెరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ ఉత్పత్తి అయ్యి, గ్యాస్ పెరుగుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది.

45
దుష్ప్రభావాలు

- గుండెల్లో మంట, ఆమ్లత పెరుగుతాయి.

- జీర్ణక్రియ దెబ్బతిని, జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారుతుంది.

- ఇన్సులిన్ స్థాయి పెరిగి, రక్తంలో చక్కెర పెరుగుతుంది.

- కడుపు నొప్పి, అజీర్తి వస్తాయి.

- వాంతులు, విరేచనాలు, వికారం, మలబద్ధకం వస్తాయి.

55
ఎప్పుడు నీళ్ళు తాగొచ్చు?

నిపుణుల ప్రకారం, ఆపిల్ తిన్నాక ఒక గంట తర్వాత నీళ్ళు తాగాలి. ఏ పండు తిన్నా కూడా ఇదే నియమం వర్తిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

click me!

Recommended Stories