వేడినీటితో స్నానం చేస్తే.. కరోనా రాదా..? అపోహలు, నిజాలు ఇవే..

First Published Mar 24, 2020, 11:48 AM IST

మాస్క్ లు పెట్టుకొని చాలా మంది ధైర్యంగా బయటకు అడుగుపెడుతున్నారు. అయితే.. మాస్క్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేవలం జలుబు, తుమ్ము, జ్వరం వంటి సాధారణ లక్షణాలతో మొదలై.. ప్రాణాలను హరించేస్తోంది. కాగా... ఈ వైరస్ గురించి అసలు నిజాలు తెలియక కొందరు ప్రజలు భ్రమలో బతుకుతున్నారు. దీంతో.. ఆరోగ్యశాఖ అధికారులు.. కరోనా కి సంబంధించి అపోహలు, నిజాలు తెలియజేశారు.
undefined
వాతావరణం చల్లగా ఉంటేనే కరోనా వ్యాప్తి చెందుతుందని.. వేడిగా ఉంటే రాదు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాగా... దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. వేడి ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
undefined
నీళ్ళు బాగా తాగడం వల్ల కరోనా వైరస్‌ ఒంట్లో నుంచి పోతుందని అనుకోవడం అపోహే. అలాగే, ఐస్‌ క్రీములు తిన్నంత మాత్రాన వైరస్‌ స్తంభించిపోతుందని అనుకోవడమూ తప్పే!
undefined
వేడి నీళ్లతో స్నానం చేసినా, అలాగే హ్యాండ్‌ డ్రయ్యర్లు వాడినా వైరస్‌ చనిపోతుందని అనుకోవడం పొరపాటు. అలాగే, ఎండలో నిలబడినంత మాత్రాన వైరస్‌ పోదు. ఒంటి మీద ఆల్కహాల్‌ స్ర్పే చేసుకున్నా, లేదంటే ఆల్కహాల్‌ తాగినా వైరస్‌ చనిపోతుందనుకోవడం అపోహ.ఫ్లూ టీకాలు వేసుకుంటే కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందనే ప్రచారం అర్థరహితమే.
undefined
మాస్క్ లు పెట్టుకొని చాలా మంది ధైర్యంగా బయటకు అడుగుపెడుతున్నారు. అయితే.. మాస్క్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ప్రతి ఆరుగంటలకు ఒకసారి మాస్క్ లు మార్చాల్సి ఉంటుంది. మాస్క్ వేసుకునేటప్పుడు ముందరభాగాన్ని చేతితో పట్టుకోకూడదు. కేవలం తాళ్లు పట్టుకొని వాటి సహాయంతో మాస్క్ లు కట్టుకోవాల్సి ఉంటుంది.
undefined
డిస్పోజబుల్‌ మాస్క్‌లను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి వాడకూడదు. వాడిన మాస్క్‌లను మూత ఉన్న చెత్త డబ్బాల్లో వేయాలి.మాస్క్‌ తొలగించిన తర్వాత చేతులను సబ్బుతో లేదంటే ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
undefined
జులుబు, జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడం లో ఇబ్బంది లాంటి లక్షణాలు కనపడగానే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. లేదా.. ఇతర దేశాల్లో ప్రయాణాలు చేసి ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా వైద్యులను కలవాలి.
undefined
పారసెటమాల్ తో కరోనా నయం అవుతుందంటూ ఇటీవల కొందరు ప్రచారం చేశారు. దానిపై కూడా వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ వచ్చినవాళ్లు 80% మంది జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడి కోలుకుంటారు.
undefined
పారాసెటమాల్‌ జ్వరంను తగ్గిస్తుంది. జ్వరం వచ్చే ఏ రోగానికైనా పారాసెటమాల్‌ జ్వరం నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాని దానితో రోగం నయం కాదు. ఉదాహరణకు మలేరియా, టీబీ, ఫ్లూ వంటి రోగాల్లో కూడా జ్వరం నుండి ఉపశమనం కోసం పారాసెటమాల్‌ వాడుతారు. అట్లానే కరోనా వైరస్‌తో వచ్చే జ్వరానికి కూడా పారాసెటమాల్‌ వేసుకోవచ్చు.
undefined
కరోనా వైరస్ వస్తే చావు ఖాయమని చాలా మంది భయపడిపోతున్నారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే... కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అది చిన్న సంఖ్యలా కనిపించవచ్చు. కానీ, వ్యాధిని అరికట్టకపోతే కొత్త వ్యాధి కావడం వల్ల, ఎవరికీ రోగనిరోధక శక్తి లేనందువల్ల ప్రపంచంలో 50-65% ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉంది.
undefined
ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ ఈ వ్యాధిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
undefined
click me!