వేప పేస్టుతో చర్మ సౌందర్యానికి కలిగే లాభాలు ఏంటో తెలుసా?

First Published Nov 28, 2021, 1:59 PM IST

వేప (Neem) అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వేప చెట్టులో అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి. వేపచెట్టును ఔషధ గని అని పిలుస్తారు. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాను కలిగి మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది.
 

జిడ్డు చర్మాన్ని (Oily skin) తగ్గించడానికి వేప చక్కగా పనిచేస్తుంది. వేప యాంటీసెప్టిక్ గుణాలు (Antiseptic properties) కలిగి ఉంటుంది. గాయాల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లను తగ్గించి చర్మానికి హాని కలగకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన వేప చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి మరింతగా పనిచేస్తుందని మీకు తెలుసా. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వేప పేస్టు తో చర్మసౌందర్యానికి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..
 

విష జ్వరాలను (Toxic fevers) సైతం తగ్గించగల సామర్థ్యం వేపాకులో ఉంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిది. డెలివరీ తర్వాత బాలింతలు వేప పేస్ట్ ను శరీరానికి అప్లై చేసుకొని స్నానం చేయమని పెద్దలు చెబుతారు. ఇలా చేయడంతో చర్మ సమస్యలు (Skin problems) తగ్గిపోతాయని చెబుతుంటారు. కమిలి ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది.
 

ముఖంపై ఏర్పడే మొటిమలు (Pimples), వాటి తాలూకు మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వేప పేస్ట్ ముఖంపై ఏర్పడే మృతకణాలను (Dead cells) తొలగిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను పైకి కనపడనివ్వదు. షాంపూ చేయడానికి ముందు తలకు వేప పేస్ట్ ను అప్లై చేసుకోవడంతో చుండ్రు సమస్యలు, జుట్టు  సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వేప పేస్ట్ ను అప్లై చేసుకోవడంతో అనేక బ్యూటీ ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

మొటిమలతో పోరాడుతుంది: కొన్ని వేపాకులు (Neem leaf paste), కొన్ని తులసి ఆకులను (Basil leaves) తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడంతో ముఖం పై మొటిమలు పూర్తిగా నయం అవుతాయి.
 

మచ్చలను తగ్గిస్తుంది: వేపాకుల పేస్ట్ (Neem leaf paste) లో కొద్దిగా పసుపు (Turmeric) కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చర్మానికి అప్లై చేసుకోవడంతో మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలు, గాయాల ద్వారా ఏర్పడిన మచ్చలను తొందరగా తగ్గిస్తుంది.
 

ముఖం పై జిడ్డు తగ్గిస్తుంది: కొన్ని వేపాకులను (Neem leaf paste) తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పెరుగు (Curd), నిమ్మరసం (Lemin juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో చర్మంపై ఉండే అధిక జిడ్డును తొలగించి చర్మం కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది.
 

మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది: వేపాకు ఫేస్ (Neem leaf paste) లో కొద్దిగా తేనె (Honey) కలుపుకొని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మానికి కావలసిన తేమను అందజేసే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

click me!