ఇంటి దగ్గర ఈ మొక్కలు నాటితే మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..

First Published | Apr 18, 2024, 9:41 AM IST

ఎండాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక రాత్రిళ్లు అయితే అస్సలు వదలవు. అయితే ఇంటి దగ్గర కొన్ని మొక్కలను పెంచితే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. అవేంటంటే? 
 

వాతావరణం మారుతున్న కొద్దీ ఇంట్లో దోమల బెడద పెరుగుతుంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని మొక్కలను ఇంటిదగ్గర పెంచితే చాలు. అవును కొన్ని ఇండోర్ మొక్కలతో దోమలు రాకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Marigold

బంతిపూల  మొక్క 

బంతిపూలను ఇంటి డెకరేషన్ కోసం బాగా ఉపయోగిస్తారు. వీటిని దేవుడికి కూడా సమర్పిస్తారు. అయితే బంతిపూల మొక్కతో కూడా దోమలు, ఎగిరే కీటకాలను తరిమికొట్టొచ్చు. అవును బంతిపూల మొక్క ఉంటే ఆ చుట్టుపక్కలకు ఒక్క దోమ కూడా రాదు. బంతిపూల వాసన దోమలకు నచ్చదు. అందుకే మీ ఇంట్లో బంతిపూల పువ్వు మొక్కను నాటండి.  దీన్ని మీ బాల్కనీలో పెట్టండి. 
 

Latest Videos


నిమ్మగడ్డి మొక్క 

లెమన్ గ్రాస్ మొక్క చూడటానికి అందంగా ఉంటుంది. ఇది మంచి వాసనను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి వచ్చే వాసన మన మానసిక స్థితిని రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది. కానీ దోమలకు ఈ వాసన అస్సలు నచ్చదు. ఈ వాసన వస్తే అవి అక్కడి నుంచి పారిపోతాయి. దీనిని దోమల నివారిణిలో కూడా ఉపయోగిస్తారు.
 

lemon balm

లెమన్ బామ్ ప్లాంట్ 

లెమన్ బామ్ మొక్క మన ఇంటిని అందంగా చేయడానికి సహాయపడుతుంది. అవును దీన్ని ఇంట్లో పెంచడం వల్ల మీ ఇల్లు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దీన్ని ఇంట్లో పెట్టడం వల్ల దోమలు బి ఇంట్లోకి అస్సలు రావు. ఈ మొక్క పెరగడానికి, బతకడానికి సూర్యరశ్మి అవసరం లేదు.

Garlic

వెల్లుల్లి మొక్క 

దోమలకు వెల్లుల్లి వాసన అస్సలు నచ్చదు. వీటి వాసన వస్తే అక్కడి నుంచి పారిపోతాయి. అందుకే  వెల్లుల్లి ఎక్కువగా తినేవారిని కూడా దోమలు తక్కువగా కుడతాయి. మీరు ఒక కుండలో వెల్లుల్లిని నాటితే మీ ఇంట్లోకి దోమలు రావు. 
 

లావెండర్ మొక్క

లావెండర్ మొక్క వాసన అద్బుతంగా ఉంటుంది. ఈ వాసన ఇంటి వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది. ఈ మొక్కను మీరు కుండలో పెంచొచ్చు. ఈ మొక్క నుంచి వచ్చే వాసనకు ఇంట్లో  ఒక్క దోమ లేకుండా బయటకు వెళ్లిపోతాయి. 
 

రోజ్మేరీ మొక్క 

రోజ్మేరీ మొక్కను సహజ దోమల నివారిణిగా పరిగణిస్తారు. ఇది దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇక ఈ మొక్క పువ్వులు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎండాకాలంలో ఈ మొక్క పువ్వులు బాగా పూస్తుంది. 
 

తులసి మొక్క

తులసి మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మొక్క గాలిని శుభ్రపరచడంతో పాటుగా, దోమలు, ఎగిరే కీటకాలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ మొక్క ఆకులు జలుబు, దగ్గును తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

click me!