ఏసీ, ఫ్యాన్ ఏదీ అవసరం లేదు.. ఇంట్లో ఈ మొక్కలుంటే ఎంత చల్లగా ఉంటుందో..!

First Published | Apr 11, 2024, 12:26 PM IST

మండిపోతున్న ఎండల వల్ల ఇండ్లు నిప్పుల కుంపటిలా మారిపోతున్నాయి. దీంతో ఇంట్లో కూర్చోవడానికి రాదు. పడుకోవడానికి రాదు. అందుకే ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏసీ, ఫ్యాన్లను వాడుతూనే ఉంటారు. నిజానికి ఇవి లేకున్నా ఇంటిని చాలా కూల్ గా ఉంచుకోవచ్చు. అది కూడా కొన్ని మొక్కలతో. 
 

ఎండాకాలంలో ఇండ్లు చాలా వేడిగా ఉంటాయి. అందుకే ఫ్యాన్లు, ఏసీ, కూలర్లను పొద్దంతా ఆన్ లోనే ఉంచుతారు. కానీ పొద్దంతా ఇలా ఏసీ, ఫ్యాన్, కూలర్లను వాడుతుంటే కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది. కానీ కరెంట్ బిల్లు ఎక్కువగా రాకుండా ఇంటిని చాలా కూల్ గా ఉంచొచ్చు. ఇందుకోసం మీరు ఏసీ, ఫ్యాన్ లను వాడాల్సిన అవసరమే ఉండదు. అది ఎలా అనుకుంటున్నారా? ఇంకెలాగా మొక్కలతోనే ఇంటిని అందంగా మార్చడమే కాకుండా చల్లగా కూడా చేయొచ్చు. మన ఇంటిని కూల్ గా ఉంచే మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కలబంద

కలబంద మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకుంటుంటారు. కలబందను ఎక్కువగా ముఖానికి, జుట్టుకు వాడుతుంటారు. ఇది మన ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడానికి కలబంద బాగా సహాయపడుతుంది. మీకు తెలుసా.. కలబంద మొక్కను ఇంటి లోపల పెంచితే అది ఇండోర్ గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
 


అరెకా పామ్ ప్లాంట్

అరెకా పామ్ మొక్కల్ని ఇంట్లోనే పెంచుతారు. ఈ మొక్కల్ని ఇంటిని డెకరేట్ చేయడానికి బాగా ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అంటే ఇండోర్ గాలిని సహజంగా తేమగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క గాలిలోని ఎన్నో విష పదార్థాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. 

ఫెర్న్ ప్లాంట్

ఇంటిని ఏసీ, ఫ్యాన్, కూలర్ లేకున్నా సహజంగా చల్లబరచడానికి ఫెర్న్ ఫ్లాంట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఇంటిని చల్లగా ఉంచడమే కాకుండా గాలిలోని తేమను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఈ మొక్క గాలి శుద్ధి చేసే బెస్ట్ మొక్కల్లో ఒకటి.
 


స్నేక్ ప్లాంట్

ఇళ్లలో ఎక్కువగా పెరిగే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ ఒకటి. ఇది గాలిని రిఫ్రెష్ చేస్తుంది. అలాగే ఇంట్లో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రత ఫాస్ట్ గా తగ్గుతుంది. దీంతో మీ ఇల్లు కూల్ గా ఉంటుంది. 

బేబీ రబ్బర్ ప్లాంట్

ఇది వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను ఈజీగా గ్రహించి ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. దీంతో ఇంట్లో వేడి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇల్లు చల్లగా మారుతుంది. 
 

గోల్డెన్ పోథోస్ ప్లాంట్

గాలిని చల్లబరచడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిజానికి ఇది కూడా ఒక రకమైన మనీ ప్లాంట్. ఈ మొక్క గాలిలోని దుమ్మును, కర్బనాన్ని త్వరగా ఫిల్టర్ చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Latest Videos

click me!