Balcony Garden: జనరేషన్ మారేకొద్దీ చాలా మంది పచ్చదనం, హాయిగా కూర్చునే సమయం కోరుకుంటున్నారు. అందుకే బాల్కనీ గార్డెన్ కోసం ట్రై చేస్తున్నారు. అదీ కూడా ట్రెండీగా. మరి చిన్న బాల్కనీలకు ఏ డిజైన్ బాగుంటుంది? అందంగా ఎలా మార్చుకోవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం.
సాయంత్రం వేళ పెరట్లోనో, బాల్కనీలోనో మొక్కల దగ్గర కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగాలని, కబుర్లు చెప్పుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ బిల్డింగులు, అపార్టుమెంట్లు రావడంతో...మొక్కలు పెంచుకునే వెసులుబాటు ఉండదు. ఒకవేళ ప్లేస్ ఉన్నా...అది చిన్నగా ఉండటంతో ఏం పెంచుతాంలే అని పట్టించుకోరు. అయితే ఇప్పుడా చింత అవసరం లేదు. దానిక్కూడా ఓ సీక్రెట్ ఉంది.
26
బాల్కనీ గార్డెన్ ట్రెండ్
జనరేషన్ మారేకొద్దీ ప్రజలకు మళ్లీ పాత రోజులు కోరుకుంటున్నారు. ఆ పచ్చదనం, చల్లగాలి కావాలనుకుంటున్నారు. అందుకే ఇళ్లలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బాల్కనీ గార్డెన్ ట్రెండ్ బాగా పెరిగింది. ఎందుకంటే, తక్కువ స్థలంలోనే ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చు. అందమైన మొక్కలు, కూర్చోవడానికి మంచి చోటు, ఎలిగెంట్ డెకరేషన్‌తో బాల్కనీని ఇంట్లో ఫేవరెట్ ప్లేస్‌గా మార్చేయొచ్చు. మీ ఇంటికి కూడా గ్రీన్ టచ్ ఇవ్వాలనుకుంటే ఈ వర్టికల్ గార్డెన్..చిన్న బాల్కనీలకు ఒక అద్భుతమైన ఆప్షన్. గోడలకు అమర్చే ప్లాంటర్లు, వేలాడే కుండీలతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ బాల్కనీకి పచ్చదనంతో పాటు మోడరన్ లుక్ ఇస్తుంది. పైగా, వీటి మెయింటెనెన్స్ ఈజీ.
36
లగ్జరీ హోటల్ లుక్
మీ బాల్కనీ రెస్టారెంట్ లుక్, లగ్జరీ హోటల్ లా రిచ్ గా కనిపించాలంటే ఈ వుడెన్ ఫ్లోరింగ్ లేదా డెక్‌తో పాటు మొక్కలు ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. రకరకాల సైజుల్లో ఉండే కుండీలు, అలంకరణ మొక్కలు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. సాయంత్రం టీ తాగడానికి లేదా రిలాక్స్ అవ్వడానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్. హాయిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
ఈ హ్యాంగింగ్ బాస్కెట్ల వల్ల పాత కాలం నాటి రోజులను గుర్తుకుతెస్తాయి. ఆ వైబ్ మీలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. హ్యాంగింగ్ బాస్కెట్లు, వేలాడే మొక్కలు బాల్కనీకి ఒక కొత్త అందాన్నిస్తాయి. మనీ ప్లాంట్, ఇంగ్లీష్ ఐవీ, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలు ఈ డిజైన్‌లో చాలా బాగుంటాయి. ఈ స్టైల్ బాల్కనీకి ఫ్రెష్, ఆకర్షణీయమైన, ఇన్‌స్టాగ్రామ్-ఫ్రెండ్లీ లుక్‌ను అందిస్తుంది.
56
సీటింగ్ కార్నర్
బాల్కనీ కొంచెం పెద్దగా ఉంటే, మొక్కల మధ్యలో ఒక చిన్న సీటింగ్ కార్నర్ ఏర్పాటు చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన కుర్చీలు, కుషన్లు, పచ్చదనం కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ డిజైన్ ఇంట్లోనే ఒక ప్రైవేట్ రిలాక్సేషన్ స్పాట్‌లో ఉన్న అనుభూతిని ఇస్తుంది.
66
స్టైలిష్ ప్లాంటర్లు
స్టైలిష్ ప్లాంటర్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైట్లు బాల్కనీ గార్డెన్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. రాత్రిపూట, ఈ లైట్ల వెలుగులో మొక్కల పచ్చదనం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మోడరన్ ఇళ్లలో బాగా పాపులర్ అవుతోంది. ఇది బాల్కనీకి లగ్జరీ టచ్ ఇస్తుంది.