gardening ideas: పనికిరాని పైపులతో మీ గార్డెన్ ను అందంగా ఇలా మార్చుకోండి

Published : May 28, 2026, 12:59 PM IST

gardening ideas: పగిలిపోయిన పాత పైపులను పారేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్త తెలివితేటలు వాడి వాటినే ఇంటికి కావాల్సిన స్టైలిష్ ఇంటీరియర్‍గా మార్చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఐడియాస్ నేర్చుకోండి. 

PREV
16
పిల్లల కోసం టేబుల్ ఆర్గనైజర్

పాత పైపుల చిన్న ముక్కలు మీ ఇంట్లో ఉన్నాయా. వాటిని అలానే డస్ట్ బిన్ లో పడేయకుండా కొంచెం టైం కేటాయిస్తే కలిపి పిల్లల కోసం ఒక అద్భుతమైన టేబుల్ ఆర్గనైజర్ తయారు చేయవచ్చు. ఇందులో పెన్ హోల్డర్, పెన్సిల్ స్టాండ్, మార్కర్ స్టాండ్ ఇలా రెడీ చేయొచ్చు. ఖర్చు తక్కువ, చూడటానికి అందంగా ఉంటుంది. ఎక్కువ కాలం ఉంటుంది. త్వరగా పాడవ్వదు కూడా. పిల్లలకు బాగా నచ్చి చదవాలనే ఉత్సాహం పెరుగుతుంది. 

26
ప్లాంటర్లుగా మార్చుకోవచ్చు

పాత పైపులు పగిలిపోయి ఉంటే...వాటిని చక్కగా మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోండి. వాటితోనే మీ ఇంటికి సెట్ అయ్యేలా ప్లాంటర్లు తయారు చేసుకోవచ్చు. అవి తెల్లగా, బ్రౌన్ కలర్ లో ఉంటాయి. కాబట్టి వాటికి కలర్ స్ప్రే వేసి నచ్చిన డిజైన్లు వేసుకోండి. వర్టికల్ గార్డెన్ స్టాండ్‌గా, హ్యాంగింగ్ ప్లాంటర్‌గా లేదా బాల్కనీ ప్లాంటర్ రాక్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇవి మీ ఇంటికి, బాల్కనీకి మోడ్రన్, యూనిక్ లుక్ ఇస్తాయి. 

36
పైపులతో ఇంటికి డెకరేటివ్ ల్యాంప్

పైపులతో ఇంట్లో మంచిగా డెకరేటివ్ ల్యాంప్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం, పైపుపై నిలువుగా గాట్లు పెట్టాలి లేదా చిన్న చిన్న డిజైన్లతో రంధ్రాలు చేయాలి. ఆ తర్వాత, దానిని LED లైట్ లేదా టీ-లైట్ పైన స్టాండ్‌లా అమర్చాలి. ఇది మీ గదికి మోడ్రన్, క్రియేటివ్ లుక్ ఇస్తుంది. బడ్జెట్‍లో మీ ఇంటికి రాయల్టీ వచ్చేస్తుంది. 

46
పిల్లల కోసం షవర్ ఏరియా

సన్నని పైపులుంటే వాటిని చక్కగా షవర్ లా మార్చేయొచ్చు. గార్డెన్‍లో ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు స్ప్రింకర్లుగా పనిచేస్తాయి. లేదా పిల్లలు చక్కగా ఆరుబయట షవర్ బాత్ చేయొచ్చు. దాని పక్కనే మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారనుకోండి…రైన్ డాన్స్ చేసుకోవచ్చు.  వేసవి కాలంలో పిల్లలు ఇందులో ఆడుకుంటూ సరదాగా స్నానం చేయవచ్చు.

56
పైపుతో షూ ర్యాక్

షూ ర్యాక్ తయారు చేయడానికి కూడా PVC పైపులను ఉపయోగించవచ్చు. దీనికోసం, పెద్ద సైజు పైపులను బూట్ల సైజుకు సరిపోయేలా కట్ చేసి, గోడకు నిలువుగా అతికించాలి. ఇందులో బూట్లు, చెప్పులు, శాండిల్స్ సులభంగా పెట్టుకోవచ్చు. దీనివల్ల అవి దుమ్ము, ధూళి నుంచి కూడా సురక్షితంగా ఉంటాయి.

66
PVC గాజుల స్టాండ్

మహిళలు PVC పైపులతో అద్భుతమైన గాజుల ఆర్గనైజర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని ఒక పెట్టెలో అమర్చి రొటేటింగ్ బ్యాంగిల్ స్టాండ్‌గా లేదా గోడకు తగిలించే హోల్డర్‌గా మార్చుకోవచ్చు. రంగురంగుల బట్టలు, ఇతర అలంకరణ వస్తువులతో దీనిని చాలా అందంగా, స్టైలిష్‌గా మార్చవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories