Kitchen Hacks: ఇంట్లో వంట చేస్తూ టైమ్ వేస్ట్ అవుతోందా? ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు, ఫ్రూట్స్ త్వరగా పాడైపోవడం… చీజ్ విరిగిపోవడం. ఇక ఈ టెన్షన్ అవసరం లేదు. మీ కిచెన్ లైఫ్ ఈజీ అయ్యే సూపర్ హ్యాక్స్ ఇప్పుడు చూద్దాం.
కిచెన్ లో చిన్న చిన్న సమస్యలతో మిగతా పనిపై ఎఫెక్ట్
ఇంట్లో వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో రోజూ జరిగేదే. కానీ చిన్న చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందుల్లా అనిపిస్తుంటాయి. ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు రావడం, కట్ చేసిన కూరగాయలు రంగు మారిపోవడం, ఫ్రూట్స్ త్వరగా పాడైపోవడం, చీజ్ విరిగిపోవడం ఇవన్నీ మనకు తెలిసిన సమస్యలే. వాటి బాగుచేసుకోవడం, సర్దుకోవడంతో రోజంతా కిచెన్ లోనే టైం అయిపోతుంది. అయితే కొన్ని హ్యాక్స్ తెలుసుకుంటే మీ పని ఈజీ అవుతుంది. టైం సేవ్ అవుతుంది.
24
ఉల్లిపాయను కోసేముందు ఫ్రీజర్ లో పెట్టాలి
ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు రావడం సహజం. దీనిని తగ్గించాలంటే ఉల్లిపాయలను ముందుగా 10–15 నిమిషాలు ఫ్రీజర్‌లో పెట్టాలి. బయటకు తీసి కాస్త కరిగిన వెంటనే కోస్తే మంట తక్కువగా ఉంటుంది. మరో మార్గం ఏమిటంటే గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టి కోయడం. ఇలా చేస్తే ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే కెమికల్ ఎఫెక్ట్ తగ్గుతుంది.
సాఫ్ట్ చీజ్‌ను చాక్ తో కోయడం కష్టంగా ఉంటుంది. ముక్కలు సమానంగా రావు. ఇలాంటి సమయంలో డెంటల్ ఫ్లాస్ తో చీజ్‌ను సులభంగా కట్ చేయోచ్చు. అలాగే చీజ్ మెత్తగా ఉంటే తురమడం కష్టం. తురిమే ముందు కొద్దిసేపు ఫ్రీజర్‌లో ఉంచితే కాస్త గట్టిపడి సులభంగా తురుముకోవచ్చు.
34
కూల్ వాటర్ లో వేస్తే నల్లగా అవ్వవు
బంగాళాదుంపలను కట్ చేసిన తర్వాత అవి త్వరగా నల్లగా మారిపోతాయి. గాలితగలడం వల్ల జరుగుతుంది. కట్ చేసిన వెంటనే చల్లటి నీళ్లలో నానబెడితే వాటి రంగు అలాగే ఉంటుంది. వండే వరకు నీటిలో ఉంచడం ఇంకా మంచిది.
టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటి పైభాగంలో ఉన్న తొడిమలను తొలగించకూడదు. అవి తేమ లోపలికి చేరకుండా సహాయపడతాయి. కొత్తిమీర వంటి ఆకుకూరలు త్వరగా వాడిపోతాయి. వాటిని కడగకుండా గాజు గ్లాస్‌లో నీళ్లు పోసి అందులో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఆకులు ఫ్రెష్ గా ఉంటాయి.
అరటిపండ్లు త్వరగా నల్లబడకుండా ఉండటానికి గుత్తి చివర ప్లాస్టిక్ ర్యాప్ చుట్టాలి. దీంతో పండ్ల నుంచి విడుదలయ్యే వాయువులు తగ్గి అవి ఎక్కువ రోజులు బాగుంటాయి. ఫ్రూట్ సలాడ్ గోధుమ రంగులోకి మారకుండా ఉండటానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి చల్లాలి.
నిమ్మ తొక్కలను పారేయకుండా తురిమి ఎండబెట్టి వంటల్లో ఉపయోగిస్తే రుచి పెరుగుతుంది. స్ట్రాబెర్రీల పైభాగాన్ని స్ట్రా సహాయంతో సులభంగా తీసేయవచ్చు. గుమ్మడికాయ లేదా పుచ్చకాయ విత్తనాలను ఐస్ క్రీం స్కూపర్‌తో తీసేస్తే పని త్వరగా పూర్తవుతుంది. కూల్ వెన్న త్వరగా మెత్తబడాలంటే ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి రోలింగ్ పిన్‌తో ఒత్తాలి.
ఈ చిన్న చిన్న కిచెన్ హ్యాక్స్ పాటిస్తే వంట పని సులభమవుతుంది. సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు. వంటగదిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్లానింగ్, కొద్దిగా జాగ్రత్త ఉంటే చాలు… పని స్మార్ట్‌గా చేసుకోవచ్చు.