ఏం చేస్తే గులాబీ పువ్వులు బాగా పూస్తాయో తెలుసా?

First Published | Aug 15, 2024, 2:08 PM IST

చాలా సార్లు గులాబీ మొక్క ఏపుగా పెరిగినా.. పువ్వులు మాత్రం ఒకటో, రెండో పూస్తుంటాయి. కానీ మీరు చిట్కాలను ఫాలో అయితే గులాబీ పువ్వులు గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. 
 

ప్రతి ఒక్కరూ గులాబీ మొక్కలను పెంచుతుంటారు.అయితే గులాబీ మొక్క బాగా పెరిగినా..పువ్వులు మాత్రం ఎక్కువగా పూయవు. చెట్టే ఇలాంటిదేమో అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ మీరు కొన్ని పనులను చేస్తే మీ గులాబీ మొక్క గుత్తులు, గుత్తులుగా పూలు పూస్తాయి. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి ఇందుకోసం ఏ చేయాలంటే? 
 


రాతి ఉప్పు

ఎప్సమ్ ఉప్పు గులాబీ మొక్కకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ఈ ఉప్పులో మెగ్నీషియం, సల్ఫర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రాతి ఉప్పు మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. మీరు దీన్ని మీ గులాబీ మొక్కలో ఎరువుగా ఉపయోగించొచ్చు.
 


రాతి ఉప్పు ఎరువు ఎలా తయారు చేయాలి?

రాతి ఉప్పు ఎరువును తయారుచేయడానికి ముందుగా 4 నుంచి 5 టీస్పూన్ల రాతి ఉప్పును తీసుకుని దానిని నీళ్లలో కలపండి. ఈ ద్రవానికి అరటి తొక్కలను చిన్నగా కట్ చేసి కలపండి. రాత్రంతా అలాగే ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం గులాబీ మొక్క మట్టిలో దీన్ని కలపండి.  గులాబీ మొక్క బాగా పూలు పూయాలంటే వారానికి ఒకసారి ఈ ఎరువును మొక్కకు వేయండి. ఇది పూలు బాగా పేసేలా చేస్తుంది.
 

రాతి ఉప్పు, ఆలం

రాతి ఉప్పు, ఆలం పౌడర్ తో కూడా మీరు గులాబీ పువ్వులు బాగా పూసూలా చేయొచ్చు. ఈ రెండింటినీ కుండీ మట్టిలో కలపాలి. మొక్కలకు రాతి ఉప్పును  గులాబీ కుండి మట్టిలో కలపడం వల్ల మొక్కలకు పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే మొక్కకు అవసరమైన పోషణ కూడా లభిస్తుంది. దీంతో  మొక్క బాగా పెరుగుతుంది. గులాబీ పువ్వులు బాగా పూయాలంటే నీటిలో 2-3 టీస్పూన్ల రాతి ఉప్పు కలిపి  వారానికి 2 సార్లు మొక్కపై స్ప్రే చేయండి.
 

Latest Videos

click me!