Gardenig: ఇంట్లోనే యాలకుల మొక్క ఎలా పెంచుకోవాలో తెలుసా?
మార్కెట్లో యాలకులు కొనాలంటే చాలా ఖరీదుగా ఉన్నాయా? అయితే.. ఈజీగా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో మీకు తెలుసా? ఎక్కువ కష్టం లేకుండా.. సింపుల్ గా ఎలా పెంచుకోవచ్చో.. స్టెప్ బై స్టెప్ చూద్దాం
మార్కెట్లో యాలకులు కొనాలంటే చాలా ఖరీదుగా ఉన్నాయా? అయితే.. ఈజీగా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో మీకు తెలుసా? ఎక్కువ కష్టం లేకుండా.. సింపుల్ గా ఎలా పెంచుకోవచ్చో.. స్టెప్ బై స్టెప్ చూద్దాం
యాలకులను మనం రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తూనే ఉంటాం. ముఖ్యంగా టీ, బిర్యానీ, స్వీట్లలో వీటిని వేయడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది. వీటిని చేర్చడం వల్ల సాధారణ వంటకాలు అద్భుతంగా మారిపోతాయి. అయితే, యాలకులు ఖరీదైన మసాలా దినుసు. దీని ధర కేజీ రూ. 3వేల నుంచి 4 వేల వరకు ఉంటుంది. మరి, అలాంటి ఖరీదైన యాలకులను ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా? దాని కోసం స్పెషల్ గా యాలకుల మొక్కను కూడా కొనాల్సిన అవసరం లేదు. మరి, ఈ మొక్కను ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లోనే యాలకుల మొక్కను ఎలా పెంచాలి..?
యాలకులను ఒకరోజు మొత్తం నానపెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను మట్టిలో పాతపెట్టాలి. ఈ మట్టిలో నానపెట్టిన విత్తనాలను 30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల కనీసం ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల తర్వాత అనుకున్న ఫలితాలు రావడం మొదలౌతాయి. అంటే, యాలకులు రావడం మొదలౌతాయి.అయితే.. ఆ సమయంలో మీరు రెగ్యులర్ గా నీరు పోయడం, ఎరువులు వేయడం లాంటివి ఇవ్వాలి. అంతే.. మీ ఇంట్లోనే యాలకుల మొక్క ఈజీగా పెరిగిపోతుంది.
యాలకుల మొక్కను పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
పచ్చి యాలకుల నుంచి విత్తనాలను తీసుకోండి. వీటిని గోరువెచ్చని నీటిలో 24 గంటలు నానపెట్టాలి.
ఈ యాలకులను ఎప్పుడూ తేమతో కూడిన, నీరు బాగా ఇంకే మట్టిలో నాటండి.
మట్టి లేదా సిరామిక్ కుండను తీసుకోండి. దానిలో నీరు బయటకు వెళ్ళడానికి రంధ్రాలు ఉండాలి.
40% గార్డెనింగ్ మట్టి, 30% ఆవు పేడ లేదా వానపాముల ఎరువు, 30% ఇసుకను కలపండి.
నానబెట్టిన విత్తనాలను మట్టిలో ఒకటి నుండి ఒకటిన్నర అంగుళాల లోతులో నాటండి. విత్తనాలపై కొద్దిగా మట్టి వేసి, నీరు చిలకరించండి. కుండను ఎల్లప్పుడూ నీడ, వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజూ
మొక్కకు నీరు చిలకరించండి. మట్టిని తేమగా ఉంచండి, కానీ ఎక్కువ నీరు పోయకండి. ఈలచి మొక్క మొలకెత్తడానికి 15 నుండి 20 రోజులు పడుతుంది. యాలకుల మొక్క 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని బాగా చూసుకుంటే 2 నుంచి 3 సంవత్సరాలలో మీకు యాలకులు రావడం మొదలౌతాయి.