ఇంట్లో దుమ్మును తగ్గించే బెస్ట్ మొక్కలు ఇవి..

First Published | Mar 30, 2024, 3:38 PM IST

మొక్కలు ఎండలోనే పెరుగుతాయని చాలా మంది అనుకుంటుంటారు. అయితే కొన్ని మొక్కలు మాత్రం ఇంట్లో నీడకు కూడా పెరుగుతాయి. అంతేకాదు ఇవి ఇంట్లో దుమ్మును చాలా వరకు తగ్గిస్తాయి తెలుసా? 

ఇళ్లు అన్నాక దుమ్ము ఉండటం చాలా కామన్. కానీ ఇంట్లో దుమ్ము వస్తువులను పాడు చేస్తుంది. పాత వాటిలా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు దుమ్ము వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇంట్లో దుమ్మును తొలగించడం ఆడవాళ్లకు సవాలు లాంటిదే. అయితే కొన్ని ఇంట్లో పెరిగే మొక్కలు సహజంగా ఇంట్లో నుంచి దుమ్మును తొలగించడానికి ఎంతో సహాయపడతాయి తెలుసా? అంతేకాదు ఈ మొక్కలు మీ ఇంటిని మరింత అందంగా మారుస్తాయి కూడా. మీరు కూడా మీ ఇంట్లో వీటిని పెంచొచ్చు. మరి ఆ మొక్కలేంటో ఓ లుక్కేద్దాం పదండి.

rubber plant

రబ్బరు మొక్క

ది నేచర్ ఆఫ్ హోమ్ ప్రకారం.. మీరు మీ ఇంటిని శుభ్రంగా, దుమ్ము లేకుండా ఉంచడానికి ఈ మొక్క బాగా సరిపోతుంది. అవును ఈ మొక్క ఉంటే ఇంట్లో దుమ్ము ఉండదు. అంతేకాక ఇది మీ ఇంటిని మరింత అందంగా మార్చేస్తుంది. మీ ఇంట్లోకి దుమ్ము ఎక్కువగా వస్తుంటే ఒక రబ్బరు మొక్కను తెచ్చి పెంచండి.
 


IVY ప్లాంట్

మీ ఇళ్లును నీట్ గా ఉంచుకోవడానికి ఈ మొక్క కూడా అద్బుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఇంట్లో నుంచి దుమ్మును బయటకు పంపడమే కాకుండా, గాలిని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది.
 

ఈత చెట్టు

ఈతపళ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని రెగ్యులర్ గా తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే ఈ మొక్కను కూడా మీరు ఇంట్లో ఎంచక్కా పెంచొచ్చు. ఈ మొక్క అత్యంత ప్రభావవంతమైన ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా.

plant peace lily

శాంతి లిల్లీ


పీస్ లిల్లీస్ చాలా శక్తివంతమైన మొక్కలు. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే ఇది చుట్టుపక్కల గాలి నుంచి సూక్ష్మ కణాలను కూడా గ్రహించగలవు. ఈ మొక్కలుంటే మీ ఇంట్లో దుమ్ము అస్సలు ఉండదు. 
 

వెదురు

వెదురు మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే చాలా మంది  ఇంట్లో ఈ మొక్కను పెంచుతుంటారు. ఈ మొక్క గాలిలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఈ మొక్కలను కూడా మీ ఇంట్లో ఎంచక్కా పెంచొచ్చు. 

Latest Videos

click me!