ఇంటి దగ్గర తక్కువ స్థలం ఉన్నా ఈ కూరగాయలను, పండ్లను పండించొచ్చు.. ఎలాగంటే?

First Published Mar 25, 2024, 12:13 PM IST

ఇంటిదగ్గర కూడా పండ్లు, కూరగాయల మొక్కలను పెంచాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ స్థలం ఉన్నవారు ఇష్టం ఉన్నా మొక్కలను పెంచరు. కానీ తక్కువ స్థలంలో కూడా పండించే కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. అవేంటంటే? 

పెరట్లో, ఇంటి పైన, బాల్కనీలో కూడా కూరగాయలను పండించేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఇలా పండించి తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుండటంతో పాటుగా మీకు మంచి ఆనందం కూడా కలుగుతంది. అయితే తక్కువ ఉండి మేం ఏదీ పండించలేకపోతున్నామని బాధపడేవారు కూడా ఉన్నారు. కానీ తక్కుత స్థలంలో కూడా మీరు కొన్ని రకాల కూరగాయలను, పండ్లను పండించొచ్చు. వర్టికల్ గార్డెనింగ్ మీకు నచ్చిన పండ్లు, కూరగాయలను పండించొచ్చు.  వర్టికల్ గార్డెనింగ్ ద్వారా స్ట్రాబెర్రీ, ద్రాక్ష, బ్లూబెర్రీస్, కివి, కాంటాలౌప్, పుచ్చకాయ పండ్ల మొక్కలను పండించొచ్చు. అలాగే టమాటా, దోసకాయ, సొరకాయ, కాకరకాయ, బెండకాయ, క్యాప్సికమ్, బచ్చలికూర, కొత్తిమీర, పుదీనా వంటివి పండించొచ్చు. 

Tomatoes


టమాటాలు

వర్టికల్ గార్డెనింగ్ లో టమాటా మొక్కలను ఎంచక్కా పెంచొచ్చు. దీనికి చెక్క సపోర్ట్ ఉంటే చాలు. ఈ పద్ధతిలో మీరు డాబా, బాల్కనీ లేదా ఇంటి ఆవరణలో టమాటా మొక్కలను పెంచుకోవచ్చు. ఇది మీ స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా టమాటాలు బాగా కాస్తుంది. వర్టికల్ గార్డెనింగ్ లో వివిధ జాతుల టమాటాలను పండించడానికి చాలా రకాల పద్ధతులను ఫాలో కావొచ్చు. మంచి రకాన్ని ఎంచుకుని పండిస్తే టమాటాలు బాగా పండుతాయి.
 

ద్రాక్ష

ద్రాక్ష పండ్ల చెట్టును మిద్దెపై లేదా బాల్కనీలో పెంచొచ్చు. ప్రత్యేకించి మీకు తక్కువ స్థలం ఉన్నప్పుడు ఈ పండ్ల చెట్టును పెంచండి. ద్రాక్ష మొక్కను కుండీలో నాటి బాల్కనీ రెయిలింగ్ లేదా కలప సహాయంతో పైకి పెంచొచ్చు.
 

దోసకాయ

దోసకాయలను మీరు బాల్కనీ లేదా మిద్దెపై పెంచొచ్చు. ఈ మొక్కను పెంచడానికి స్థలం ఎక్కువగా అవసరం ఉండదు. ఈ మొక్క తక్కువ స్థలంలో కూడా బాగా పెరుగుతుంది. వేలాడే బుట్టలో దోసకాయ మొక్కలను నాటొచ్చు. కావాలనుకుంటే చెక్క ఫ్రేమ్ లో కూడా పెంచుకోవచ్చు.

బీన్స్

బీన్స్ ను పొలంలోనే కాకుండా బాల్కనీలు, మిద్దెలపై కూడా పండించొచ్చు. ఇది పొదలుగా పెరుగుతుంది. వీటిని మీరు ఫ్రేమ్ లేదా స్వింగ్ ద్వారా ఈజీగా పెంచొచ్చు. దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు.ఇది వేరే మొక్కలతో కూడా బాగా పెరుగుతుంది. 

gardening

పుచ్చకాయ

పుచ్చకాయలు ఎండాకాలంలో బాగా కాస్తాయి. ఈ పండు ఎంతో టేస్టీగా ఉండటంతో ప్రతి ఒక్కరూ తింటారు. మీరు ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచొచ్చు. మీ ఇంట్లో స్థలం తక్కువగా ఉంటే పుచ్చకాయ చెట్టును పెంచండి. ఇనుప ఫ్రేమ్ సహాయంతో మీరు ఈ మొక్కను పైకి పెరిగేలా చేయొచ్చు. 
 

click me!