గులాబీ చెట్టు బాగా పువ్వులు పూయాలంటే ఏం చేయాలి?

First Published | Feb 27, 2024, 10:58 AM IST

గులాబీ చెట్టు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే కొన్ని చెట్లు రెండు మూడు రోజులో వారానికో ఒకటిరెండు పూలను పూస్తుంటాయి. అసలు గులాబీలు ఎక్కువ ఎందుకు పూయవు? పువ్వులు బాగా పూయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గులాబీ మొక్క లేని ఇల్లు ఉండదేమో.. సిటీళ్లో అద్దె రూముల్లో ఉండేవారు కూడా గులాబీ మొక్కను కుండీల్లో పెంచుతుంటారు. పెరట్లో, టెర్రస్, బాల్కనీలో ఈ మొక్కలను పెంచుతుంటారు. అయితే మనం నాటిన కొన్ని మొక్కలు బాగా పూలు పూస్తే.. కొన్ని మొక్కలు మాత్రం ఎప్పుడో ఒకసారి పూలను పూస్తుంటాయి. అలాగే మొగ్గలు పట్టడం కూడా ఆగిపోతుంది. చెట్టు మాత్రం పెరుగుతుంటుంది. పచ్చగా కూడా కనిపిస్తుంటుంది. అసలు గులాబీ మొక్కకు పువ్వులు ఎందుకు పూయవు? పూయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గులాబీ మొక్కకు పువ్వులు ఎందుకు పూయవు?

గులాబీ చెట్టు పూవులు పూయకపోవడానికి మొదటి కారణం.. మొక్కకు సూర్యరశ్మి తగలకపోవడమే. మొక్క నీడలో ఉండి సూర్యరశ్మి అందకపోతే కూడా పూలు పూయవు. గులాబీ మొక్కకు ప్రతిరోజూ 4 నుంచి 5 గంటల సూర్యరశ్మి అవసరం. ఇన్ని గంటల సూర్యరశ్మి అందకపోతే కూడా మొక్కలు పూలు పూయవు. 
 


నేల పొడిగా 

తేమను నిలుపుకునే నేలలో మాత్రమే గులాబీ మొక్క బాగా పూలు పూస్తుంది. ఇసుక నేలలో గులాబీ మొక్కను నాటితే ఈ మొక్క పెరుగుదల ఉండదు. అలాగే గులాబీ మొక్కను కట్ చేయకపోతే కూడా మొక్క పూలు పూయదు. అందుకే మొక్క నుంచి ఎండిపోయిన కాండం, ఆకులను తొలగించాలి. 

పువ్వులు పూయకపోవడానికి అధిక ఫలదీకరణం కూడా కారణం కావొచ్చు. చాలా మంది మొక్కను పుష్పించనప్పుడు పదేపదే ఫలదీకరణం చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల మొక్క పూత పూయడం కూడా ఆగిపోతుంది.

గులాబీ మొక్క పువ్వులు బాగా పూయలంటే? 

గులాబీ మొక్క బాగా పూలు పుయ్యాలంటే మొక్కను ఇంటి బయట సూర్యరశ్మి తగిలే ప్లేస్ లో పెట్టాలి. 

అలాగే మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. 

గులాబీ మొక్క కుండీలో తరచుగా ఆహారాన్ని వేయకూడదు. వీలైతే పండ్ల తొక్కలతో చేసిన ఎరువును వేయండి. 

మొక్కను కట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి.  పువ్వులు మళ్లీ బయటకు వచ్చే అవకాశం ఇవ్వండి.

Latest Videos

click me!