Xiaomi Diwali Sale: ప్రస్తుతం భారత్ మార్కెట్ లో అదిరిపోయే ఆఫర్లతో పండగ సేల్ నడుస్తోంది. ఈ క్రమంలోనే షావోమీ ఇండియా దీపావళి సేల్ 2025లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు, వేరబుల్స్‌పై 60% వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం.
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఇండియా ఫెస్టివల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. “Diwali with Xiaomi Sale 2025” పేరుతో ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్, పవర్‌బ్యాంక్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు సహా అనేక స్మార్ట్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై 60% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లు mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ భాగస్వాముల వద్ద కూడా అందుబాటులో ఉంటాయని షావోమీ ఇండియా ప్రకటించింది.
25
షావోమీ, రెడ్మీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు
ఈ సేల్ లో షావోమీ, రెడ్మీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో రెడ్మీ నోట్ 14 సిరీస్, ఇతర మోడళ్లపై భారీ తగ్గింపులు ప్రకటించారు.
Redmi Note 14 Pro+ 5G: రూ.34,999 నుంచి రూ.24,999కు సేల్ లో ఉంటుంది.
Redmi Note 14 Pro 5G: రూ.28,999 నుంచి రూ.20,999
Redmi Note 14: రూ.21,999 నుంచి రూ.15,499
Redmi Note 14 SE: రూ.14,999 నుంచి రూ.12,999
Redmi A4 5G: రూ.8,499 నుంచి రూ.7,499
Redmi 14C: రూ.9,999 నుంచి రూ.8,999
Redmi 15: రూ.14,999 (ప్రత్యేక ఆఫర్ ధర)
అద్భుతమైన ఫీచర్లు, భారీ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీలు, AI ఫీచర్లతో ఈ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
35
షావోమీ, రెడ్మీ టాబ్లెట్‌లపై భారీ తగ్గింపులు
వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ చదువులకు అనువైన షావోమీ, రెడ్మీ టాబ్లెట్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Xiaomi Pad 7: రూ.34,999 నుంచి రూ.22,999 లకు సేల్ లో లభిస్తోంది.
Xiaomi Pad Pro: రూ.24,999 నుంచి రూ.16,999
Redmi Pad 2: రూ.13,999 నుంచి రూ.11,999
Redmi Pad SE 4G: రూ.10,999 నుంచి రూ.7,999
ప్రీమియం డిస్‌ప్లేలు, లాంగ్ బ్యాటరీలతో ఇవి ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి.
షావోమీ, రెడ్మీ స్మార్ట్ టీవీలు, హోమ్ ప్రోడక్ట్స్ పై కూడా భారీ తగ్గింపులు
ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పంచే బిగ్ స్క్రీన్ షావోమీ, రెడ్మీ స్మార్ట్ టీవీలు ఈ సేల్ లో ప్రత్యేక ఆఫర్లలో లభిస్తున్నాయి.
CineMagiQLED X Pro Series: రూ.44,999 నుంచి రూ.25,999 లకు ఈ సేల్ లో అందుబాటులో ఉంటుంది.
FantastiQLED FX Pro Series: రూ.44,999 నుంచి రూ.21,999
ఇవి 4K రెజల్యూషన్, డాల్బీ విజన్, ఇమర్సివ్ ఆడియో సపోర్ట్‌తో అందుబాటులో ఉన్నాయి.
వీటిపై కూడా తగ్గింపు ధరలు ఉన్నాయి..
Redmi Watch Move: రూ.1,699
Redmi Buds 5C: రూ.1,799
Redmi 4i Powerbank 20K: రూ.1,899
Xiaomi Air Purifier 4 Lite: రూ.12,999
Xiaomi Grooming Kit: రూ.1,599
55
కస్టమర్ సపోర్ట్, బ్యాంక్ ఆఫర్ల వివరాలు
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సర్వే ప్రకారం, షావోమీ ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌లో టాప్ లో ఉంది. కేవలం 4 గంటల్లో 52% సమస్యలను పరిష్కరించడం, 37% రిపేర్ ఖర్చులు రూ.1,000 లోపే ముగించడంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. దీంతో కస్టమర్ సర్వీసులో తోపుగా నిలుస్తోంది.
అలాగే, ఈ సేల్ లో బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.5,000 వరకు అదనపు డిస్కౌంట్, జీరో డౌన్ పేమెంట్, నో-ఇంటరెస్ట్ EMI సదుపాయాలు కూడా వినియోగదారులకు అందిస్తోంది. మొత్తంగా ఈ పండగ సీజన్‌లో షావోమీ ఇండియా సేల్ వినియోగదారులకు స్మార్ట్ లైఫ్‌స్టైల్ గ్యాడ్జెట్స్ ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.