సూపర్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 FE ఇండియాలో లాంచ్.. ధరేంతో తెలుసా?

Published : Sep 15, 2025, 11:26 PM IST

Samsung Galaxy S25 FE: శాంసంగ్ గెలాక్సీ S25 FE భారత్‌లో విడుదల అయింది. ఫ్రీ స్టోరేజ్ అప్‌గ్రేడ్, ₹5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో అందుబాటులో ఉంది. దీని స్పెక్స్, ఫీచర్లు సహా ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
భారత్‌లోకి శాంసంగ్ గెలాక్సీ S25 FE ఎంట్రీ

శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ Galaxy S25 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తోంది. గోరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రోటక్షన్ తో స్క్రీన్ మరింత బలంగా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

26
శాంసంగ్ గెలాక్సీ S25 FE ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

శాంసంగ్ గెలాక్సీ S25 FE Exynos 2400 ప్రాసెసర్ చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇది 4nm ప్రాసెస్‌పై ఆధారపడిన SoC. ఇదే ప్రాసెసర్ గెలాక్సీ S24, S24+ మోడల్స్‌లో కూడా ఉపయోగించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 తో వస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడల్ కు 7 సంవత్సరాల OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. కాబట్టి ఎక్కువ కాలం వినియోగానికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది.

36
శాంసంగ్ గెలాక్సీ S25 FE కెమెరా సెటప్

శాంసంగ్ గెలాక్సీ S25 FE లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

• 50MP ప్రైమరీ సెన్సార్ (OIS తో)

• 12MP అల్ట్రా-వైడ్ లెన్స్

• 8MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, OIS తో)

సెల్ఫీ కెమెరా 12MP రిజల్యూషన్‌తో వస్తుంది. AI ఆధారిత ProVisual Engine, నైట్ ఫోటోగ్రఫీ మోడ్, Super HDR వీడియో, ఫోటో అసిస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

46
శాంసంగ్ గెలాక్సీ S25 FE బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు

శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ ప్రకారం కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్ 65% వరకు ఛార్జ్ అవుతుంది. ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది. అంటే ఇది నీరు, దూళి దుమ్ము నిరోధకంగా ఉంటుంది.

56
శాంసంగ్ గెలాక్సీ S25 FE ధర ఎంత? ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.

• 8GB RAM + 128GB స్టోరేజ్ - ₹59,999

• 8GB RAM + 256GB స్టోరేజ్ - ₹65,999

• 8GB RAM + 512GB స్టోరేజ్ - ₹77,999

ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌గా 256GB మోడల్ కొనుగోలు చేసే వారికి ఫ్రీగా 512GB వెర్షన్ అప్‌గ్రేడ్ లభిస్తుంది. అలాగే, ₹5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి.

66
3 కలర్ వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ S25 FE

శాంసంగ్ గెలాక్సీ S25 FE నేవీ, జెట్ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. Samsung.com, ప్రత్యేక Samsung స్టోర్స్, అధీకృత రీటైల్ ఔట్‌లెట్లు, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్‌లో సెప్టెంబర్ 29 నుంచి అందుబాటులో ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories