15రోజులు పొడిగింపు
క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. జియో తన ప్రత్యేక క్రికెట్ ఆఫర్‌ను ప్రస్తుత, కొత్త కస్టమర్ల కోసం ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించారు. ఇంతకుముందు ఈ ఆఫర్ మార్చి 31తో ముగియాల్సి ఉంది. కానీ ఇది బాగా హిట్ కావడంతో మరో 15రోజులు పొడిగించారు.
రిలయన్స్ జియో
ఈ ఆఫర్ కింద, ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త జియో సిమ్ కనెక్షన్ తీసుకున్న లేదా కనీసం ₹299తో రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. ఇప్పటికే రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కూడా ₹100తో యాడ్-ఆన్ ప్యాక్ తీసుకుని ఈ ఆఫర్‌ను పొందవచ్చు. దీని ద్వారా రిలయన్స్ జియో కస్టమర్లు ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌తో, కస్టమర్లకు టీవీ/మొబైల్‌లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఐపీఎల్ ఫ్రీ
ఈ ఆఫర్ కారణంగా 4K క్వాలిటీలో మ్యాచ్ లను వీక్షించవచ్చు. దీనివల్ల కస్టమర్లు ఐపీఎల్ క్రికెట్ సీజన్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. జియో హాట్‌స్టార్ ప్యాక్ మార్చి 22, 2025 నుంచి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో పాటు జియో ఇళ్లకు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఉచిత ట్రయల్ కనెక్షన్ 50 రోజుల వరకు ఉచితంగా ఉంటుంది. కస్టమర్లు 4Kలో క్రికెట్ చూసే ఉత్తమ అనుభవంతో ఇంటి వద్దనే మంచి వినోదాన్ని పొందవచ్చు. జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌లో 800+ టీవీ ఛానెళ్లు, 11+ ఓటీటీ అప్లికేషన్‌లు, అన్‌లిమిటెడ్ వై-ఫై కూడా ఉన్నాయి.