Reliance Jio జియోని కొట్టేవాడే లేడట.. ఇంటర్నెట్ వేగంలో ఇదే తోపు!

Published : Apr 03, 2025, 10:42 AM IST

నిస్సందేహంగా భారత్లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ జియో. ఆకాశంలో ఉన్న టెలికాం వినియోగ ధరల్ని నేలపైకి దించింది కూడా జియోనే. అయితే తర్వాత టారిఫ్ ప్లాన్లను పెంచుకుంటూ వస్తోంది. అయినా ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తోంది జియోనే.  

PREV
13
Reliance Jio జియోని కొట్టేవాడే లేడట.. ఇంటర్నెట్ వేగంలో ఇదే తోపు!

జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, విఐ వంటి భారత టెలికాం సంస్థలు వినియోగదారుల్ని ఆకర్షించడానికి విపరీతంగా పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే వినియోగదారులకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. ఆ ధరతో 2024 ద్వితీయార్థంలో వేగవంతమైన ఇంటర్నెట్ ఎవరిదో తేలింది.

23

నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓక్లా ఈ రిపోర్ట్ విడుదల చేసింది. జియో సగటు 5G డౌన్‌లోడ్ వేగం 258.54 Mbps, అప్‌లోడ్ వేగం 14.54 Mbpsగా ఉంది. వేగవంతమైన నెట్‌వర్క్‌లో జియో టాప్ ప్లేస్‌లో ఉంది. ఓక్లా వెబ్‌సైట్ ప్రకారం, స్పీడ్ స్కోర్ ద్వారా నెట్‌వర్క్ వేగం లెక్కిస్తారు. డౌన్‌లోడ్, అప్‌లోడ్ సామర్థ్యం ఆధారంగా లెక్కిస్తారు. జైపూర్ మినహా 9 నగరాల్లో జియో టాప్ అని ఓక్లా తెలిపింది.

33

జైపూర్ నగరంలో అత్యధికంగా 181.68 Mbps డౌన్‌లోడ్ వేగం ఉంది. కోల్‌కతా రెండో స్థానంలో, అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి. ముంబైలో తక్కువగా 75.75 Mbps డౌన్‌లోడ్ వేగం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories