Amazon sale: రూ. 6 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫ‌ర్

Published : Jul 11, 2025, 03:48 PM ISTUpdated : Jul 11, 2025, 04:50 PM IST

ఓటీటీలు వ‌చ్చిన త‌ర్వాత ఇంట్లోనే థియేట‌ర్ సెట‌ప్ చేసుకుంటున్నారు. అయితే పెద్ద సైజ్ స్క్రీన్ టీవీలు కొనాలంటే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాలి. కానీ అలాంటి అవ‌స‌రం లేకుండా ఇప్పుడు ప్రొజెక్ట‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  

PREV
15
E GATE Atom 3X Projector

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌లో ఈ గేట్ ఆట‌మ్ 3 ఎక్స్ ప్రొజెక్ట‌ర్‌పై భారీ డిస్కౌంట్ ల‌భిస్తోంది. చూడ్డానికి చిన్న‌గా ఉన్నా మంచి అనుభూతిని అందిస్తుందీ ప్రొజెక్ట‌ర్‌. ఈ ప్రొజెక్ట‌ర్ అస‌లు ధ‌ర రూ. 21,999గా ఉండ‌గా, 68 శాతం డిస్కౌంట్‌తో రూ. 6990కి ల‌భిస్తోంది. ప్ర‌స్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అద‌నంగా 10 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది.

25
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

ఈ ప్రొజెక్టర్‌ నేటివ్ 1080p ఫుల్ HD రెజల్యూషన్‌ను అందిస్తుంది. అలాగే 4K వీడియోలను డీకోడ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. 5000:1 కాంట్రాస్ట్ రేషియో ఈ ప్రొజెక్ట‌ర్ సొంతం. ఈ ప్రొజెక్ట‌ర్ స‌హాయంతో 210 ఇంచెస్ స్క్రీన్‌పై హెచ్‌డీఆర్ స‌పోర్ట్‌తో కూడిన‌ వీడియోల‌ను చూడొచ్చు.

35
అత్య‌ధునిక చిప్

ఈ ప్రొజెక్ట‌ర్ ఆండ్రాయిడ్ 13 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కి స‌పోర్ట్ చేస్తుంది. అలాగే ఇది శ‌క్తివంత‌మైన అమోలాజిక్ టీ950S చిప్ ప్రాసెస‌ర్‌తో ప‌నిచేస్తుంది. ARM Cortex 450 GPU ఈ ప్రొజెక్ట‌ర్ సొంతం. ఇక ఇందులో 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌, సోనిలివ్‌తో పాటు మ‌రెన్నో ఓటీటీ యాప్స్‌కు స‌పోర్ట్ చేస్తుంది.

45
థియేట‌ర్ ఫీల్

ఈ ప్రొజెక్ట‌ర్‌లో 180° రొటేషన్ ఫీచ‌ర్‌ను అందించారు. దీంతో చిన్న గ‌దుల్లోనూ థియేట‌ర్ ఫీల్ పొందొచ్చు. దీనిని మీరు కావాల్సిన కోణంలో తిప్పి స్క్రీన్ చూడొచ్చు. చిన్న గదుల్లోనూ పెద్ద స్క్రీన్ పొందేలా షార్ట్ థ్రూ లెన్స్ (1.1:1) ఉప‌యోగించారు. ఇది తక్కువ దూరంలోనే పెద్ద చిత్రం ప్రొజెక్షన్‌కు స‌పోర్ట్ చేస్తుంది.

55
అద్భుతమైన కెస్టోన్ ఫీచర్

ఇక ఈ ప్రొజెక్ట‌ర్‌ అద్భుత‌మైన ఆటో కీస్టోన్ + 4D/4P Keystone Correction ను అందిస్తుంది. దీంతో వీడియో దానంత‌ట‌దే సెట్ అవుతుంది. ఈ ప్రొజెక్ట‌ర్‌కు HDMI, USB, 3.5 mm ఆడియో అవుట్, Bluetooth 5.0 వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను అందించారు. అలాగే స్క్రీన్ మిర్ర‌రింగ్‌తో కూడా వీడియోలు చూడొచ్చు. ఈ ప్రొజెక్ట‌ర్‌పై కంపెనీ ఏడాది వారంటీ అందిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories