ఇక ధర విషయానికొస్తే కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ సిరీస్‌ను బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Nord 5ను సుమారు రూ. 29,999 లేదా దాని కంటే కొంచెం ఎక్కువ ధరకు అందించవచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే Nord CE 5 విషయానికి వస్తే, ఇది సుమారు రూ. 25,000 ధరలో రానుందని అంచనా. Nord CE 4ను గతంలో రూ. 24,999కి తీసుకువచ్చారు. దీంతో ఈ మోడల్ ఇదే రేంజ్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా. మొత్తం మీద మిడ్ రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకోవడానికి వన్‌ప్లస్ పక్కా ప్లాన్ వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఎప్పుడు అందుబాటులోకి రానుంది.?
వన్‌ప్లస్ నార్డ్5, వన్‌ప్లస్ సీఈ5 ఫోన్లు జూలై 8వ తేదీన అధికారికంగా లాంచ్ కానుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే Nord 5 కోసం ప్రత్యేకంగా అమెజాన్‌లో లాండింగ్ పేజీ లైవ్ అయ్యింది. అందులో ఫోన్ లుక్, డిజైన్ హైలైట్స్, కలర్ ఆప్షన్లు వంటి కీలక అంశాలను చూపిస్తున్నారు. మరి ఈ ఫోన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.