Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో

Published : Sep 17, 2026, 08:34 AM IST

Smart TV: ప్ర‌స్తుతం స్మార్ట్ టీవీలు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. ప్ర‌తీ ఒక్క‌రి ఇంట్లో స్మార్ట్ టీవీలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా కంపెనీల మ‌ధ్య పెరిగిన పోటీ నేప‌థ్యంలో ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అమెజాన్‌లో ఓ స్మార్ట్ టీవీపై మంచి ఆఫ‌ర్ ల‌భిస్తోంది.

PREV
15
43 ఇంచుల పెద్ద స్క్రీన్.. ఫుల్ HD రిజల్యూషన్

విజియో వ‌ర‌ల్డ్ సంస్థకు చెందిన VW43AQ3 స్పెక్ట్రా సిరీస్ స్మార్ట్ టీవీలో 43 ఇంచుల స్క్రీన్ ఉంటుంది. ఇందులో 1920 × 1080 పిక్సెల్స్ Full HD రిజల్యూషన్ అందించారు. సినిమాలు, సీరియళ్లు, క్రికెట్, యూట్యూబ్ వీడియోలు వంటివి పెద్ద స్క్రీన్‌పై స్పష్టంగా చూడొచ్చు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hzగా ఉంది.

25
QLED డిస్‌ప్లే.. రంగులు మరింత స్పష్టంగా

ఈ టీవీలో QLED డిస్‌ప్లే టెక్నాలజీ ఉంది. క్వాంట‌మ్ లుకెంట్‌, ట్రూ డిస్‌ప్లే, సినిమా జూమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 16.7 మిలియన్ రంగులను సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే HDR10 సపోర్ట్ కూడా ఉంది. దీంతో HDR కంటెంట్ చూసేటప్పుడు ప్రకాశవంతమైన ప్రాంతాలు, చీకటి ప్రాంతాల మధ్య తేడా మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఐపీ టెక్నాలజీ కూడా అందించారు.

35
నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్ వీడియోతో పాటు ఎన్నో యాప్స్

ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కావడంతో ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి వివిధ ఆన్‌లైన్ కంటెంట్‌ను చూడొచ్చు. ఇందులో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్‌స్టార్‌, యూట్యూబ్‌, జీ5వంటి ప్రముఖ యాప్స్‌కు సపోర్ట్ ఉంది. ప్లెక్స్‌, య‌ప్‌టీవీ, ఈరోస్ నౌ, లైవ్ న్యూస్ వంటి ఇతర యాప్స్‌ కూడా సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్, మిరాకాస్ట్‌ సదుపాయం ఉండటంతో మొబైల్‌లోని కంటెంట్‌ను టీవీ స్క్రీన్‌పై చూడవచ్చు. ధ‌ర విష‌యానికొస్తే అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ అస‌లు ధ‌ర రూ. 29,999గా ఉండ‌గా, 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,499కి ల‌భిస్తోంది. అద‌నంగా ప‌లు క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా రూ. 500 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తోంది.

45
24 వాట్స్ సౌండ్.. కనెక్టివిటీకి ఎక్కువ ఆప్షన్లు

ఈ టీవీలో 24 వాట్స్ అవుట్‌పుట్‌తో బిల్ట్-ఇన్ బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. స్టీరియో స‌రౌండ్ సౌండ్‌తో పాటు ఐదు సౌండ్ మోడ్‌లు అందించారు. సెట్‌టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్, బ్లూ-రే ప్లేయర్ వంటి పరికరాలను కనెక్ట్ చేసుకోవడానికి 2 HDMI 2.0, 1 HDMI 2.1 పోర్టులు ఉన్నాయి. హార్డ్‌డిస్క్, పెన్‌డ్రైవ్ వంటి పరికరాల కోసం 2 USB 2.0 పోర్టులు ఉన్నాయి. ఇథ‌ర్‌నెట్‌, వైఫై కనెక్టివిటీ కూడా లభిస్తుంది.

55
క్వాడ్ కోర్ ప్రాసెసర్.. రోజువారీ వినియోగానికి ఉపయోగకరం

VW43AQ3లో క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌తో ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందించారు. టీవీ స్టోరేజ్ సామర్థ్యం 4GBగా పేర్కొన్నారు. PC కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్, ప్లేవాల్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బాక్స్‌లో టీవీ యూనిట్, రిమోట్, పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్, రెండు స్టాండ్లు, స్టాండ్ స్క్రూలు వస్తాయి. మొత్తం మీద 43 ఇంచుల స్క్రీన్, QLED డిస్‌ప్లే, HDR10, OTT యాప్స్, 24W సౌండ్, HDMI/USB పోర్టులు వంటి ఫీచర్లను ఒకే టీవీలో అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories