
భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. పోకో బ్రాండ్ నుంచి రీసెంట్‌గా విడుదలైన మోడల్స్ ఇవాళ్టి నుంచి సేల్‌కి అందుబాటులోకి వచ్చాయి. భారీ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ స్క్రీన్, పవర్ ఫుల్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు, ఫ్లాట్ డిస్కౌంట్లు భారీగా లభిస్తున్నాయి.
ప్రస్తుతం కొత్త 5G మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇవి మంచి ఛాయిస్. ముఖ్యంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లు, డిస్కౌంట్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
POCO X8 5G ఫోన్ ఇండియన్ మార్కెట్లో 3 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.29,999 గా ఉంది. ఇక 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగా, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.35,999 గా ఉంది.
ఈ ఫోన్‌పై కంపెనీ రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ.2,000 ఫ్లాట్ ఆఫర్ ఉండగా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, లేదా ఎస్బీఐ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు బెనిఫిట్ లభిస్తుంది. ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.26,999కే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లాక్, ఫైరీ ఆరెంజ్, ఫ్రాస్ట్ వైట్ కలర్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ మొబైల్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3500nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వెట్ టచ్ 2.0 సపోర్ట్ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్‌ను ఈజీగా వాడవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3.0పై పనిచేస్తుంది. ఇందులో 4nm స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. కెమెరా విషయానికి వస్తే 50MP OIS మేన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 9000mAh భారీ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకత. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్, IP69K రేటింగ్ కూడా ఇందులో ఉన్నాయి.
మీరు రూ.35,000 లోపు అత్యంత శక్తివంతమైన ఫోన్ కోసం చూస్తుంటే POCO X8 Power 5G మంచి ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై 55% వరకు, 8GB + 256GB వేరియంట్‌పై 54% వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
కంపెనీ ఈ ఫోన్‌పై రూ.2,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది అప్లై చేసిన తర్వాత ఫోన్ ధర రూ.32,299కి తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.34,700 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. నెలవారీ రూ.2,833 చొప్పున 12 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. HDFC Bank, SBI, Flipkart Axis Bank కార్డ్స్ ద్వారా ఈ ఈఎమ్‌ఐ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇందులో 10,000mAh బిగ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. దీనికి 100W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4nm ప్రాసెసింగ్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 చిప్‌సెట్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రా వైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా అందించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 3పై నడుస్తుంది. దీనికి 4 ప్రధాన అప్‌డేట్లు ఇవ్వనున్నారు.
తక్కువ బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కావాలనుకునే వారి కోసం POCO M8x 5G వచ్చింది. 6GB RAM, భారీ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,999గా నిర్ణయించారు. అయితే రూ.2,000 డిస్కౌంట్ ఆఫర్ తర్వాత దీని ధర రూ.21,000కు చేరుతుంది. బాక్స్‌లోనే ఛార్జర్, బ్యాక్ కవర్ కూడా వస్తాయి.
ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల పెద్ద HD+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ లభిస్తుంది. దీని లేదర్ గ్రీన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 చిప్‌సెట్‌తో భారత్‌లో విడుదలైన తొలి డివైజ్ ఇది.
ఫోన్‌లో 7900mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో ఇది హ్యాపీగా రెండు రోజుల పాటు వస్తుంది. దీనికి 45W ఛార్జర్ ఇస్తున్నారు. 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఈ ఫోన్ పవర్ బ్యాంక్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కెమెరా పరంగా ఇది వేగంగా ఫోటోలు తీస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ పై పనిచేస్తుంది. కంపెనీ దీనికి 4 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఆఫర్ చేస్తోంది.
ఈ మూడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు వేర్వేరు బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లోకి వచ్చాయి. మీ బడ్జెట్ రూ.20,000 ప్రాంతంలో ఉండి, పెద్ద స్క్రీన్, రెండు రోజులు వచ్చే బ్యాటరీ కావాలంటే POCO M8x 5G సరైన ఎంపిక.
ఒకవేళ మీ బడ్జెట్ రూ.30,000 దాకా ఉండి, అమోలెడ్ స్క్రీన్, మంచి కెమెరా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలంటే POCO X8 5G వైపు వెళ్లవచ్చు. ఇక అసలు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందనే భయం లేకూడదు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ 10,000mAh బ్యాటరీ కావాలనుకునే గేమింగ్, మల్టీమీడియా లవర్స్ కోసం POCO X8 Power 5G బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.