Realme C85 5G: అర గంట నీటిలో ఉన్నా ఈ ఫోన్‌కి ఏం కాదు.. ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఈ ఫీచ‌ర్లేంటీ భ‌య్యా

Published : Dec 08, 2025, 09:52 AM IST

Realme C85 5G: ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ భార‌త మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియ‌ల్‌మీ సీ85 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ మొబైల్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పెద్ద డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌ రేట్‌ హైలైట్‌

Realme C85 5Gలో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో తీసుకొచ్చారు. కార్నింగ్ గ్లాస్‌ ప్రొటెక్షన్ ఈ స్క్రీన్‌కు ప్రొటెక్ష‌న్ అందించారు. MIL-STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో తెచ్చారు. స్క్రీన్ 100% sRGB గామట్‌ కలిగి ఉంటుంది. 90.4% స్క్రీన్-టు-బాడీ రేషియోతో విజువల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ మెరుగుపరుస్తుంది.

25
IP69 ప్రో రేటింగ్, అరగంట నీటిలో ఉన్నా..

ఈ ఫోన్‌కు IP69 ప్రో రేటింగ్ ఉంది. 6 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలు ఉంచినా ఎటువంటి ఇబ్బంది లేదని కంపెనీ చెబుతోంది. డస్ట్‌ ప్రూఫ్, హీట్‌, ప్రెషర్‌ నుంచి రక్షణ క‌ల్పిస్తుంది. వేపర్‌ చాంబర్‌ (5300 sq mm) ఉండటంతో హెవీ యూజ్‌లోనూ ఫోన్ ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.

35
ప్రాసెసర్, స్టోరేజ్

హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ARM Mali G57 MC2 GPUను అందించారు. డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా 12GB వరకు పెంచుకోవ‌చ్చు. ఒకేసారి 17 యాప్‌లను సాఫీగా రన్ చేయగల సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. సాఫ్ట్‌వేర్ Android 15 ఆధారిత Realme UI 6.0తో ప‌నిచేస్తుంది.

45
కెమెరా సెటప్ – సోనీ సెన్సార్ తో స్పష్టమైన ఫోటోలు

కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ IMX852 సెన్సార్ రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. రెండు కెమెరాలూ 1080p వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలవు.

55
బ్యాటరీ, ఛార్జింగ్

Realme C85 5G హైలైట్ 7000mAh భారీ బ్యాటరీ అని చెప్పొచ్చు. 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. ఒక్క‌సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 22 గంటల వీడియో, 50 గంటల కాలింగ్, 145 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ వ‌స్తుంది. క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 5G, 4G LTE, Bluetooth 5.2, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, GPS, USB Type-C ల‌ను అందించారు. ధ‌ర విష‌యానికొస్తే 4GB + 128GB వేరియంట్ రూ. 15,499, 6GB + 128GB వేరియంట్ ధ‌ర రూ. 16,999గా ఉంది. ప్రారంభ ఆఫ‌ర్‌లో భాగంగా రూ. 500 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories