Pillow Speaker: నిద్రపోయే ముందు పాటలు వినడం చాలా మందికి అలవాటు. కానీ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పడుకుంటే చెవులపై ఒత్తిడి పడుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే ఓ అద్భుతమైన గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది. ఆ ప్రొడక్ట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్‌లో డ్రీమ్వేవ్ పిల్లో స్పీకర్ పిల్లో ఫర్ స్లీపింగ్ పేరుతో ఈ పిల్లో స్పీకర్ అందుబాటులో ఉంది. ఈ ప్రొడక్ట్ అసలు ధర రూ. 999 కాగా ప్రస్తుతం 71 శాతం డిస్కౌంట్‌తో రూ. 288కే లభిస్తోంది. ఈ పిల్లో స్పీకర్లో అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఉపయోగించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగాన్ని బట్టి ఏడు రాత్రుల వరకు ఉపయోగించుకోవచ్చు.
24
పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా ఆడియో వినొచ్చు
ఈ స్పీకర్‌ను దిండు కింద ఉంచుకుని బ్లూటూత్ ద్వారా మొబైల్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకమైన బోన్ కండక్షన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. దీని ద్వారా దిండు మీదుగా ఆడియో వినేలా రూపొందించారు. పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ప్రశాంతమైన శబ్దాలు వినడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒకే మంచంపై ఇద్దరు పడుకునేవారికి, హాస్టళ్లలో ఇతరులతో కలిసి ఉండేవారికి ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు.
34
పలుచని డిజైన్.. పక్కకు తిరిగి పడుకునేవారికి అనుకూలం
సాధారణ ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతే చెవులపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పక్కకు తిరిగి పడుకునేవారికి అసౌకర్యం కలగొచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు AROART X3 పిల్లో స్పీకర్‌ను పలుచని ఆకారంలో రూపొందించారు. దీని మందం సుమారు 11 మిల్లీమీటర్లు (0.43 అంగుళాలు). బరువు సుమారు 82 గ్రాములు. దిండు కింద ఉంచుకునేలా తయారు చేశారు. ప్రయాణాల సమయంలో కూడా వెంట తీసుకెళ్లవచ్చు. అయితే దిండు మందం, స్పీకర్ ఉంచిన స్థానం ఆధారంగా వినికిడి అనుభవం మారవచ్చు.
ఈ పిల్లో స్పీకర్‌ను బ్లూటూత్ సదుపాయం ఉన్న స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేక వైర్లు అవసరం లేదు. కంపెనీ వివరాల ప్రకారం, ఇందులో 30, 60, 90 నిమిషాల ఆటో ఆఫ్ టైమర్ సదుపాయం ఉంది. అంటే మనకు నచ్చిన సమయాన్ని ఎంచుకుంటే, ఆ సమయం పూర్తయ్యాక స్పీకర్ ఆటోమేటిక్‌గా ఆగేలా సెట్ చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు పాటలు లేదా ఆడియో వింటూ ఉండేవారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. దీంతో అవసరం లేనప్పుడు స్పీకర్ పనిచేయకుండా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ప్రొడక్ట్ కొనుగోలు చేసే ముందు రివ్యూలను గమనించడం, ఇంతకు ముందు ఎవరైనా ఈ ప్రొడక్ట్ ను కొనుగోలు చేస్తే వారి అభిప్రాయాలను తెలుసుకొని కొనడం మంచిది.