DSLR లాంటి కెమెరా.. ₹25,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే

Published : Nov 06, 2025, 04:31 PM ISTUpdated : Nov 06, 2025, 04:45 PM IST

Best Camera Phones Under 25000: నవంబర్ 2025లో ₹25,000 లోపు DSLR లాంటి కెమెరాలతో ఉన్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కెమెరాతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు, 5G ఫీచర్లు వీటిలో ప్రత్యేకతలుగా ఉన్నాయి.

PREV
16
₹25,000 లోపు DSLR లాంటి కెమెరా ఫోన్లు

నవంబర్ 2025లో మీరు DSLR లాంటి కెమెరా క్వాలిటీతో పాటు 5G కనెక్టివిటీ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే, ఈ జాబితా మీ కోసమే.. ! ₹25,000 బడ్జెట్‌లో అత్యుత్తమ కెమెరా పనితీరు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్లను పలు బ్రాండ్స్ అందిస్తున్నాయి. వాటిలో నథింగ్, రియల్ మీ, మోటరోలా, రెడ్మీ, ఐక్యూ వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఉన్నాయి. ఈ వివరాలు గమనిస్తే..

26
నథింగ్ ఫోన్ 3ఏ

నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a)లో డ్యూయల్ 50MP రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది. దీని వల్ల ఫోటోలు క్లీన్‌గా, షార్ప్‌గా వస్తాయి. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ (Snapdragon) 7s Gen 3 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది డైలీ యూజ్, గేమింగ్‌కు మంచి పనితీరు ఇస్తుంది.

ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కలిగి ఉంది. బ్యాటరీ కెపాసిటీ 5000mAh, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. డిజైన్, కెమెరా, పనితీరు.. మూడింట్లోనూ ఇది అద్భుతమైన ఎంపిక. దీని ధర సుమారు 22,500 రూపాయలుగా ఉంది.

36
రెడ్మీ నోట్ 14 ప్రో 5G

ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం రెడ్మీ నోట్ 14 ప్రో (Redmi Note 14 Pro 5G) బెస్ట్ ఎంపిక. ఇందులో 200MP ప్రధాన కెమెరా ఉంది, ఇది OIS సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.

MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌తో ఫోన్ పనిచేస్తుంది. కెమెరా పనితీరు మాత్రమే కాకుండా గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో కూడా ఇది అద్భుతమైన పనితీరును చూపిస్తుంది. దీని ధర ₹23,999గా ఉంటుంది.

46
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G

మోటరోలా బ్రాండ్ నుంచి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) 50MP రియర్ కెమెరాతో వస్తుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది OIS సపోర్ట్‌తో షేక్‌లేని ఫోటోలు తీస్తుంది. 4కే వీడియో సపోర్టు ఉంటుంది.

ఫోన్‌లో 6.7 ఇంచుల 1.5K pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌తో ఇది శక్తివంతమైన పనితీరు ఇస్తుంది. 5500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర ₹21,069 గా ఉంది.

56
రియల్ మీ 5టీ

రియల్ మీ నుంచి వచ్చిన రియల్ మీ 15టీ (Realme 15T) ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి మంచి ఎంపిక. ఇందులో ముందు, వెనుక రెండు 50MP కెమెరాలు ఉన్నాయి. ఇది సెల్ఫీ ప్రేమికులకు కూడా పర్ఫెక్ట్ ఫోన్. 7000mAh భారీ బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

MediaTek Dimensity 6400 Max ప్రాసెసర్‌తో ఇది రోజువారీ పనుల్లో వేగంగా పనిచేస్తుంది. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్, ప్రాసెసర్ పనితీరు.. ఈ మూడు అంశాల్లో రియల్ మీ 15టీ మంచి ఎంపికగా నిలుస్తుంది. ఈ ఫోన్ ధర ₹20,999 గా ఉంది.

66
ఐక్యూ నియో 10ఆర్ 5జీ

ఐక్యూ నుంచి వచ్చిన ఐక్యూ నియో 10ఆర్ (iQOO Neo 10R 5G)లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 (Snapdragon 8s Gen 3) ప్రాసెసర్‌ చిప్ సెట్ ను కలిగి వుంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు ఇస్తుంది. 6400mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫోటో, వీడియో క్వాలిటీ పరంగా ఇది DSLR స్థాయి అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఫోన్ ధర ₹24,998గా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories